Film Industry: సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విభాగాలు ఉంటాయి, మరెన్నో లెక్కలు ఉంటాయి, సినిమా అంటే నిర్మాతది ఒక్కడిదే కాదు, చాలా మందికి సినిమాలో హక్కులు ఉంటాయి. అలాగే బాధ్యతలు కూడా ఉంటాయి. పైగా ఇండస్ట్రీని బట్టి సినిమా లెక్కలు మారిపోతూ ఉంటాయి. అందుకే, దేశవ్యాప్తంగా టాలీవుడ్ లో ఒకలా, కోలీవుడ్ లో మరోలా, ఇక బాలీవుడ్ లో ఇంకోలా సినిమాలకు టాక్స్ విధానం ఉంటుంది.

అయితే, దీన్ని వల్ల ప్రభుత్వాలకు ఎంతవరకు మేలు జరుగుతుందో తెలియదు గానీ, సినిమా ఇండస్ట్రీలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే, దేశవ్యాప్తంగా ఒకే టాక్స్ విధానం అమలు చేస్తే ఎలా ఉంటుంది ? ఆ ఇబ్బందులు అన్నీ తీరతాయి. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమిళనాడు సినీ నిర్మాతల మండలి ప్రధాన సలహాదారుడు టి.రాజేందర్ ఒక విజ్ఞప్తి చేశాడు.
దేశవ్యాప్తంగా ఒకే టాక్స్ విధానం అమలు చేయాలని ఆయన కోరాడు. అలాగే సినిమాలకు వీపీఎఫ్ తగ్గించాలని డిమాండ్ చేశాడు టి.రాజేందర్. తమిళనాడు సినీ నిర్మాతల మండలి తరఫున బుధవారం స్థానిక వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టి.రాజేందర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Also Read: సర్ ప్రైజ్ కి రెడీగా ఉండండి అంటున్న మెగాస్టార్ చిరంజీవి…
సినిమాలకు వీపీఎఫ్ టాక్స్ తగ్గించాలని గత రెండేళ్లుగా కోరుతున్నా.. పట్టించుకోక పోవడం బాధాకరమైన విషయం అని ఆయన చెప్పారు. నిజంగానే ప్రభుత్వాలు ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలను వేధిస్తున్నాయి. ఇండస్ట్రీకి ఉన్న సమస్యల గురించి అడిగితే.. కనీస పరిష్కారం కూడా చూపించవు. ఈ విషయంలో అన్ని సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
నిజానికి ఈ వీపీఎఫ్ టాక్స్ అనేది నిర్మాతలకు సంబంధం లేని అంశం. అది క్యూబ్ సంస్థలకు, అలాగే థియేటర్ల యాజమాన్యానికి సంబంధించిన అంశం. కానీ, నిర్మాతలను ఆ వీపీఎక్స్ టాక్స్ చెల్లించమని కోరడం కచ్చితంగా సమంజసం కాదు. అదే విధంగా లోకల్ బాడీ టాక్స్ ను ప్రభుత్వాలు రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే సినిమా ఇండస్ట్రీలు ఊపిరి పీల్చుకుంటాయి.
Also Read: నన్ను నేను నమ్ముకుంటాను అంటున్న సుడిగాలి సుధీర్… గాలోడు టీజర్ రిలీజ్