Pushpa: ‘పుష్ప’ పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్. పుష్ప మూవీ చూసి ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. పుష్ప సినిమా అదిరిపోయింది అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతూ.. సుకుమార్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుందని.. అసలు ప్రతి పాత్రను ఆయన అద్భుతంగా మలిచాడని, అలాగే ప్రతి నటుడు టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ ఇచ్చారని సెల్వ రాఘవన్ చెప్పుకొచ్చాడు.

అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతం అన్నాడు. దేవి మ్యూజిక్ కి తాను అడిక్ట్ అయిపోయాను అంటూ సెల్వ రాఘవన్ చెప్పడం విశేషం. ఇక పుష్ప బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం అంటూ మెసేజ్ చేశాడు. ఇక అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కూడా అదిరిపోయింది అని, అసలు బన్నీ నటన మరో లెవెల్లో ఉందని, మెయిన్ గా బన్నీ బాడీ లాంగ్వేజ్, అలాగే బన్నీ నటన మైండ్ బ్లోయింగ్ గా ఉందని సెల్వ రాఘవన్ చాలా ఎగ్జైటింగ్ తో ట్వీట్ పెట్టాడు.
Also Read: ‘పుష్ప’ను 28 కోట్లకు కొన్నారు.. మైత్రికి అన్నీ లాభాలే !
మహేష్ కూడా ‘పుష్ప’ పై పాజిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ కూడా ట్వీట్స్ చేస్తూ.. ‘పుష్పగా నటించిన అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ గా ఉంది. అలాగే ఒరిజినల్, సెన్సేషనల్‌గా ఉంది. బన్నీ అత్యద్భుతంగా నటించాడు. ఇక సుకుమార్, తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో మరోసారి నిరూపించాడు’ అని మహేష్ ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు. మొత్తానికి పుష్ప పై ప్రముఖులు తెగ ప్రేమను కురిపిస్తున్నారు. అయితే అది కొంచెం అతి ప్రేమ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
#PushpaTheRise WOW ! What an entertainer!Blown away.Kudos to #Sukumar ! All the characters have done a terrific job. Addicted to @ThisIsDSP ‘s songs and BGM !And @alluarjun ,what a performance !Body language and mind blowing acting !Loved the little nuances! Hats off 😍😍❤️❤️
— selvaraghavan (@selvaraghavan) January 8, 2022