https://oktelugu.com/

Raj Tarun: ‘రాజ్ తరుణ్’కి బంపర్ ఆఫర్.. రవితేజ అయినా హిట్ ఇస్తాడా ?

Raj Tarun: ‘రాజ్ తరుణ్’ కెరీర్ లో చాలా స్పీడ్ గా ఎదిగాడు, ప్రస్తుతం అంతే స్పీడ్ గా కెరీర్ పడిపోయింది. ఐదేళ్ల క్రితం రాజ్ తరుణ్ దగ్గర ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు ఉండేవి. ఇప్పుడు ఎంత ఇచ్చినా సినిమా చేస్తాను అని రాజ్ తరుణ్ ఆఫర్ ఇచ్చినా నిర్మాత లేడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేయమని రాజ్ తరుణ్ ను బుక్ చేసుకునేవాళ్ళు. కానీ, ఇప్పుడు రాజ్ తరుణ్ తో సినిమా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 3, 2022 / 05:56 PM IST
    Follow us on

    Raj Tarun: ‘రాజ్ తరుణ్’ కెరీర్ లో చాలా స్పీడ్ గా ఎదిగాడు, ప్రస్తుతం అంతే స్పీడ్ గా కెరీర్ పడిపోయింది. ఐదేళ్ల క్రితం రాజ్ తరుణ్ దగ్గర ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతల అడ్వాన్స్ లు ఉండేవి. ఇప్పుడు ఎంత ఇచ్చినా సినిమా చేస్తాను అని రాజ్ తరుణ్ ఆఫర్ ఇచ్చినా నిర్మాత లేడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేయమని రాజ్ తరుణ్ ను బుక్ చేసుకునేవాళ్ళు.

    Raj Tarun

    కానీ, ఇప్పుడు రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి ఎవ్వరూ కనీస ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఉన్న రాజ్ తరుణ్ కి ఓ బంపర్ ఆఫర్ తగిలింది. మాస్ మహా రాజా రవితేజ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఓ కీలక పాత్ర ఉంది. అయితే, ఆ పాత్రలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించబోతున్నాడు.

    Also Read: ఆర్ఆర్ఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. ఆందోళనలో మూవీ యూనిట్..

    రాజ్ తరుణ్ కెరీర్ కి ఇది ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ మూవీ. అన్నిటికి మించి హీరో రవితేజ. కాబట్టి.. రాజ్ తరుణ్ కి ఇది మంచి అవకాశం. మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ఇది బాగా ఉపయోగించుకోవచ్చు. మరి రాజ్ తరుణ్ ఈ ఛాన్స్ ను ఎలా వాడుకుంటాడో చూడాలి.

    నిజానికి ఆరేళ్ళ క్రితం రాజ్ తరుణ్ కి ఒక డైరెక్టర్ వెళ్లి కథ చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. అంతగా రాజ్ తరుణ్ కి అప్పుడు డిమాండ్ ఉండేది. ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘కుమారి 21F’ లాంటి వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత రాజ్ తరుణ్ రేంజ్ బాగా పెరిగింది.

    సడెన్ గా లైం లైట్ లోకి వచ్చాడు. అయితే అదృష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. రాజ్ తరుణ్ ప్రస్తుతం బ్యాడ్ టైంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి రవితేజ అయినా హిట్ ఇస్తాడా ? చూడాలి.

    Also Read: ఆలు లేదు, చూలు లేదు.. అప్పుడే ప్లానింగ్ ఏమిటి అనిల్ ? 

    Tags