Acharya Movie: “కల్లోలం” అంటూ స్టెప్పులతో దుమ్ము రేపుతోన్న చిరు… అందాల ఆరబోతలో రెజీనా ఫుల్ ట్రీట్ !

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. చిరు చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే వినాయక్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక మెగాస్టార్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా నటిస్తుండడంతో […]

Written By: Raghava Rao Gara, Updated On : January 3, 2022 6:02 pm
Follow us on

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. చిరు చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే వినాయక్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక మెగాస్టార్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్‌ లుక్‌, పాటలు ఈ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

హీరోయిన్ రెజీనా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే ఈ పాట టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా ఈ ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ముఖ్యంగా చిరంజీవి ఈ పాటకు వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. డ్యాన్స్‌లకు పెట్టింది పేరైనా చిరు… ఎన్నేళ్లు అయినా తనలోని స్టామినా ఏ మాత్రం తగ్గలేదన్నట్లు స్టెప్స్‌తో రచ్చ రచ్చ చేశారు.

రెజీనాతో పోటీపడీ మరీ కాలు కదిపారు. మరో వైపు రెజీనా కూడా తన అందాలతో కుర్రకారుని ఫిదా చేస్తుంది. ఈ పాటను భాస్కరభట్ల రచించగా.. రేవంత్‌, గీతా మాధురి పాడారు. ఇక సంగీతం దిగ్గజం మణిశర్మ అందించిన ట్యూన్స్‌ ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఆచార్యతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి చిరు గట్టిగా ప్లాన్ ఛేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Tags