
బాలయ్య బాబు సినిమా ‘అఖండ’ టైటిల్ టీజర్ అనూహ్యంగా ఇప్పటికే 40 మిలియన్ల వ్యూస్ అందుకోవడం, అదీ కేవలం 12 రోజుల్లో అనేసరికి ఇప్పుడు అందరికీ ఆ వ్యూస్ పై అనుమానాలు మొదలైపోయాయి. ఇంకా కరెక్ట్ గా మాట్లాడుకుంటే… 12 రోజుల్లో 43 లక్షలకు పైగా వ్యూస్ రావడం అంటే, ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్స్ కే సాధ్యం కావట్లేదు. అలాంటిది, గట్టిగా ఏభై కోట్లు మార్కెట్ లేని బాలయ్య బాబు సినిమా టీజర్ కి అన్ని లక్షల వ్యూస్ ఎలా వస్తున్నాయి ?
ప్రతి సినిమా వ్యక్తికి ప్రస్తుతం కలుగుతున్న అనుమానం ఇది. అఖండ టీజర్ ఊపు చూస్తుంటే.. త్వరలోనే అరకోటి దాటేలా ఉంది. అయినా ఇతర పెద్ద హీరోలకు సాధ్యం కానీ ఈ రికార్డ్ బాలయ్యకు ఎలా సాధ్యం ? అలాగే పెద్ద సినిమాలకు సాధ్యం కాని ఈ రికార్డు అఖండ టీజర్ కి ఎలా పాజిబుల్ ? ఇది చాలా మందికి అర్ధం కానీ మిస్టరీగానే మారింది. మొత్తమ్మీద కాస్త అవగాహన ఉన్నవారు మాత్రం, కేవలం మార్కెటింగ్ టెక్నీక్ తోనే వ్యూస్ తెప్పిస్తున్నారని తేల్చేస్తున్నారు.
ఒకవేళ ఇదే నిజం అయితే.. మరి రేపు కలెక్షన్స్ ఎలా తెప్పిస్తారు ? సినిమాకి హిట్ టాక్ ను ఎలా తెప్పిస్తారు ? ఏది ఏమైనా డబ్బులతో వ్యూస్ తెప్పించుకోవడం అంటే దిగజారిపోయినట్టే. బాలయ్య లాంటి ఒకప్పటి అగ్రహీరో ఇలాంటి జిముక్కులకు పాల్పడటం నిజంగా బాధాకరమైన విషయం. తమ టీజర్ కి ఇన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయని సోషల్ మీడియాలో డప్పు వేసుకోవడానికి తప్ప, నిజంగా ఈ వ్యూస్ వల్ల కలిగే ప్రయోజనం సున్నా.
ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంతగా పాపులర్ అయ్యాయి అంటే కారణం.. అఖండ టీజర్ లాంటి ప్రాజెక్ట్ లు వల్లే. నిజానికి కొన్నేళ్ల క్రితమే ఒక పెద్ద హీరో ఈ పద్దతిని ఇంట్రడ్యూస్ చేశాడు. అందరి కంటే తనకే ఎక్కువ స్టార్ డమ్ ఉంది అని నిరూపించుకోవడానికి అప్పుడు ఆ హీరోగారు ఇలాంటి ఫేక్ వ్యూస్ తో రికార్డ్ లు సృష్టించారు. ఇప్పుడు అదే ఫాలో అవుతూ బాలయ్య బాబు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇది ప్రేక్షకుల దౌర్భాగ్యం.