
భారత్ కు సహాయం చేయడానికి ఆస్ట్రేలియా కూడా ముందుకొచ్చింది. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి ఆక్సిజన్, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపనున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంద్రి గ్రెగ్ హంట్ సోమవారం తెలిపారు. భారత్ కు అత్యవసరంగా ఆదుకునేందుకు సిద్దమని ఇప్పటికే అమెరికా, జర్మనీ, బ్రిటన్ దేశాలు ప్రకటించాయి.