బాలయ్యకి తత్త్వం బోధ పడింది !

మొత్తానికి బాలయ్యకి తత్త్వం బోధ పడింది. తానూ ఎలాంటి సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారో బాలయ్యకి అర్ధం అయింది. లేకపోతే.. సూపర్ స్టార్ రజినీకాంత్ పేరిట ఉన్న అత్యధిక టీజర్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయడం ఏమిటి ? అంటే అఖండ టీజర్ లో బాలయ్య కొత్తగా కనిపించాడు. సో.. తానూ కొత్తగా సరికొత్తగా కనిపిస్తే.. యావత్తు ప్రేక్షక లోకం తనను ఇంకా చూడటానికి సిద్ధంగా ఉంది అనే విషయం అఖండ టీజర్ తో […]

Written By: Raghava Rao Gara, Updated On : April 26, 2021 1:00 pm
Follow us on


మొత్తానికి బాలయ్యకి తత్త్వం బోధ పడింది. తానూ ఎలాంటి సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారో బాలయ్యకి అర్ధం అయింది. లేకపోతే.. సూపర్ స్టార్ రజినీకాంత్ పేరిట ఉన్న అత్యధిక టీజర్ వ్యూస్ రికార్డ్ ను, బాలయ్య బ్రేక్ చేయడం ఏమిటి ? అంటే అఖండ టీజర్ లో బాలయ్య కొత్తగా కనిపించాడు. సో.. తానూ కొత్తగా సరికొత్తగా కనిపిస్తే.. యావత్తు ప్రేక్షక లోకం తనను ఇంకా చూడటానికి సిద్ధంగా ఉంది అనే విషయం అఖండ టీజర్ తో రుజువు అయింది.

అందుకే బాలయ్య ఒక విషయంలో మాత్రం బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాడు. ఇక నుండి తనదైన సినిమాలు చెయ్యడం కన్నా… డైరక్టర్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే .. తానూ కొత్తగా కనిపిస్తాను అంటూ బాలయ్య అభిప్రాయ పడుతున్నాడు. నిజానికి బోయపాటి తీస్తున్న ‘అఖండ’ కథ పూర్తిగా వినకుండానే బాలయ్య ఒప్పుకున్నాడు. ఎందుకంటే.. బోయపాటి స్టైల్ ఏంటో బాలయ్యకి బాగా తెలుసు. అలాగే, మిగిలిన దర్శకుల విషయంలో కూడా బాలయ్య బలంగానే నమ్ముతాడు.

కాబట్టి, మంచి దర్శకులను సెలెక్ట్ చేసుకుని.. పూర్తిగా సినిమాకి సంబంధించినంత వరకూ వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ పోతే తనకు తెగ సంతోషంగా ఉంటుందని, అలాగే హిట్ కూడా గ్యారంటీ ఉంటుందని బాలయ్య ఫీల్ అవుతున్నారు. అన్నట్టు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రెండు సినిమాలు చెయ్యబోతున్నారు. ఒకటి… ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని కాగా, మరొక మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో.

ఎలాగూ ఈ ఇద్దరు దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉన్నావారే. గోపీచంద్ ది మసాలా ఎలిమెంట్స్ టైప్ సినిమా అయితే, అనిల్ రావిపూడిది పూర్తిగా కామెడీ పంథా సినిమా, సో బాలయ్య హ్యాపీగా వాళ్ళ పద్దతిలో సినిమాలు చేస్తే.. కొత్తగా కనిపించడం ఖాయం. జనాలని మెప్పించడం ఖాయం.