Homeఎంటర్టైన్మెంట్Star Heroes: స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!

Star Heroes: స్టార్ హీరోలకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇవే..!

Star Heroes: ఒక మనిషి తనకున్న హ్యాబిట్స్ ద్వారా మంచి వ్యక్తిగానో లేదా చెడు వ్యక్తిగానో మారుతుంటాడని జనరల్‌గా పెద్దలు చెప్తుంటారు. అందుకే మంచి అలవాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచిస్తుంటారు కూడా. కాగా, సెలబ్రిటీలూ తమకుండే అలవాట్ల గురించి శ్రద్ధ వహిస్తుంటారు.

ఎందుకంటే తాము ఏదేని బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకున్నట్లయితే దానిని తమ అభిమానులు కూడా ఫాలో అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే వారు జాగ్రత్తగా ఉంటారు. కాగా, మన స్టార్ హీరోలకూ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Star Heroes
Rajinikanth, Allu Arjun and Mahesh Babu

తమిళ్ తలైవా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రియల్ లైఫ్‌లో సింప్లిసిటీకి కేరాఫ్‌గా రజనీకాంత్.. సిల్వర్ స్క్రీన్ పైన మాత్రం.. వెరీ స్టైలిష్‌గా కనబడుతుంటారు. ఇకపోతే ఈయనకున్న బ్యాడ్ హ్యాబిట్ గురించి అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది. సిగరెట్ తాగడం అనేది ఈయనకున్న అతిపెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఇప్పటికే చాలా సార్లు తాను ఈ విషయమై చెప్పారు కూడా. సిగరెట్ తాగడం మానేయాలని, అది తాగడం వల్ల తాను కూడా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. ఇప్పటికీ రజనీ సిగరెట్ కాలుస్తున్నారని, అయితే, మానేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Also Read: బన్నీకి చిత్తూరు యాస నేర్పిన ఈ చిన్నోడి కథ మీకు తెలుసా?

ఇకపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సిగరెట్ స్మోకింగ్ చేస్తాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, ఇందులో నిజమెంత ఉందనేది అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయితే లేదు. ‘పుష్ప’ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’ ఫిల్మ్‌తో పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. విజయ్ దేవరకొండ తన సినిమాల్లో పాత్రల ప్రకారం సిగరెట్ స్మోకింగ్ చేస్తుంటాడు. కాగా, రియల్ లైఫ్‌లో తనకు సిగరెట్ కాల్చే అలవాటుండగా దానిని మానేశాడని తెలుసత్ోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాగా, అప్పట్లో చైన్ స్మోకింగ్ చేశాడని కొన్ని వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజమెంత ఉందనేది తెలియదు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడని, ఆయనపై పలు కేసులున్నాయని సమాచారం. ఇక సూర్యకు రోజుకు పది డ్రెస్సులు మార్చే బ్యాడ్ హ్యాబిట్ ఉందని టాక్. ధనుష్ శాకాహారి. ఇది మంచి అలవాటే అయినా విదేశాలకు వెళ్లినపుడు ఈ హ్యాబిట్‌తో ఇబ్బంది పడ్డారట ధనుష్.

Also Read: మహేష్ కోసం త్రివిక్రమ్ ‘హెలికాప్టర్ల ఫైట్’ !
Recommended Videos

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular