Arjuna Phalguna: యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున ఫల్గుణ’. అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. అయితే, రిలీజ్ అయిన మొదటి షో నుంచి ‘అర్జున ఫల్గుణ’ టాక్ చాలా బ్యాడ్ గా వచ్చింది. ఆ బ్యాడ్ టాక్ తో బాగా రాడ్ రంబోలా సినిమాగా నిలిచిపోయింది. పైగా ఓపెనింగ్స్ కూడా రాలేదు ఈ సినిమాకు. ఇక రెండో షోకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు.

ఒక విధంగా ఈ మధ్య కాలంలో శ్రీవిష్ణు హీరోగా చేసిన సినిమాల్లోనే ‘అర్జున ఫల్గుణ’ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. మరి ఓసారి ఈ సినిమా కలెక్షన్లను చూద్దాం.
ఇప్పటి వరకు ‘అర్జున ఫల్గుణ’ టోటల్ కలెక్షన్లను గమనిస్తే :
గుంటూరు 0.12 కోట్లు
కృష్ణా 0.06 కోట్లు
నెల్లూరు 0.04 కోట్లు
నైజాం 0.19 కోట్లు
సీడెడ్ 0.13 కోట్లు
ఉత్తరాంధ్ర 0.11 కోట్లు
ఈస్ట్ 0.09 కోట్లు
వెస్ట్ 0.07 కోట్లు
Also Read: ఓటీటీలోకి వచ్చిన ‘పుష్ప’ ఊపు తగ్గలేదుగా !
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.81 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.07 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.88 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
నిజానికి ‘అర్జున ఫల్గుణ’ సినిమాకి రూ.2.3 కోట్ల బిజినెస్ జరిగింది. అయితే, జరిగిన బిజినెస్ కి వచ్చిన కలెక్షన్స్ కి ఏ మాత్రం పొంతన లేదు. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమాకి కేవలం రూ. 0.88 కోట్ల షేర్ ను మాత్రమే వచ్చింది. మొత్తమ్మీద ఈ సినిమా పెద్ద డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచింది. వైవిధ్యభరిత కథానాయకుడు అంటూ శ్రీవిష్ణు గురించి ఎంత ప్రమోట్ చేసినా అమృత అయ్యర్ కథానాయికగా నటించింది అని గ్లామర్ స్టిల్స్ వదిలినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ‘అర్జున ఫల్గుణ’ కలెక్షన్స్ క్లోజ్ అయ్యాయి. చివరగా బయ్యర్లకు కన్నీళ్లు మిగిలాయి.
Also Read: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ‘శ్యామ్ సింగరాయ్’.. ఎప్పుడో తెలుసా?