https://oktelugu.com/

హీరోగారితో ఇలియానా ఎఫైర్.. నిజమేనట !

గోవాభామ ఇలియానా అంటేనే యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా తన అందచందాలతో ఇలియానా కనువిందు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సీనియర్ బ్యూటీ పై బాలీవుడ్ లో రోజురోజుకూ రూమర్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలియానా ప్రస్తుతం ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, అందుకే ఆమె సినిమాలు తగ్గించి, ఆ హీరోగారి సేవలో ఫుల్ బిజీగా ఉందని హిందీ […]

Written By:
  • admin
  • , Updated On : April 4, 2021 12:26 pm
    Follow us on

    Illeana
    గోవాభామ ఇలియానా అంటేనే యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా తన అందచందాలతో ఇలియానా కనువిందు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సీనియర్ బ్యూటీ పై బాలీవుడ్ లో రోజురోజుకూ రూమర్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలియానా ప్రస్తుతం ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్ లో ఉందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, అందుకే ఆమె సినిమాలు తగ్గించి, ఆ హీరోగారి సేవలో ఫుల్ బిజీగా ఉందని హిందీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    నిజానికి ఇలాంటి పుకార్లు గతంలో కూడా వచ్చాయి. అయితే అప్పట్లో ఇలాంటి ప్రచారం మొదలుకాగానే వాటిని తీవ్రంగా ఖండించే ఇలియానా, హీరోగారితో ఎఫైర్ అని వచ్చే వార్తలను మాత్రం ఆమె అసలు ఖండించడం లేదు. పైగా ఆ హీరోగారికి ఇప్పటికే పెళ్లి అయింది. పెళ్లి చేసుకుంది కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ను. పైగా ఆ హీరోగారు, ఇప్పటికీ ఫుల్ డిమాండ్ ఉన్న తన స్టార్ వైఫ్ అంటే భయపడతాడట. అందుకే ఇలియానా విషయంలో ఆయన రూమర్ రాగానే, అది పూర్తిగా ఫేక్ అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

    కానీ ఇలియానా మాత్రం వస్తున్న ఈ రూమర్ల పై, ఆమె ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో అంతా నిజమే అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఒక్క సినిమా కూడా చేయడంలేదు. ఆ మద్య చాలా సినిమాల తరువాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చి రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేసినా.. ఆ సినిమా డిజాస్టర్ దెబ్బకు ఈ ముదురు భామకు తెలుగులో అవకాశాలు రాకుండా పోయాయి. అసలు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న టైంలో ఈ అమ్మడు, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలగాలనే ఆశతో ఇక్కడ అవకాశాలు కాదనుకుని అక్కడికి వెళ్ళి.. చివరకు ఇలాంటి బ్యాడ్ న్యూస్ ల్లో మళ్ళీ హాట్ టాపిక్ అయింది.