ఇది మనందరి ప్రాథమిక కర్తవ్యం: రామ్‌చరణ్‌

మొక్కలు నాటడం మనందరి ప్రాథమిక కర్తవ్యమని సినీనటుడు రామ్‌చరణ్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌చాలెంచ్‌ను స్వీకరించిన రామ్‌చరణ్‌ ఆదివారం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఆనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద బతుకగలుగుతున్నాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన జోగినిపల్లి సంతోష్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ ద్వారా అందరినీ కదిలించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు […]

Written By: Suresh, Updated On : November 8, 2020 11:05 am
Follow us on

మొక్కలు నాటడం మనందరి ప్రాథమిక కర్తవ్యమని సినీనటుడు రామ్‌చరణ్‌ పిలుపునిచ్చారు. గ్రీన్‌చాలెంచ్‌ను స్వీకరించిన రామ్‌చరణ్‌ ఆదివారం జూబ్లిహిల్స్‌లోని తన నివాసంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ఆనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనమందరం ఈ భూమి మీద బతుకగలుగుతున్నాం. లేదంటే విపత్తులతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన జోగినిపల్లి సంతోష్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ ద్వారా అందరినీ కదిలించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.