హైకోర్టులో దుబ్బాక ఎమ్మెల్యే పిటిషన్

దుబ్బాక ఉప ఎన్నికలో రూ. 18 లక్షలు లభ్యమయ్యాయంటూ తనమై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని దుబ్బాకలో ఇటీవల గెలుపొందిన బీజేపీ ఎమ్మల్యే రఘునందన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ లక్మణ్ బెంచ్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేసించింది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పోలీసలు రఘునందన్ రావు బంధువైన అంజన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ రూ.18 లక్షలు […]

Written By: Suresh, Updated On : November 12, 2020 4:51 pm
Follow us on

దుబ్బాక ఉప ఎన్నికలో రూ. 18 లక్షలు లభ్యమయ్యాయంటూ తనమై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని దుబ్బాకలో ఇటీవల గెలుపొందిన బీజేపీ ఎమ్మల్యే రఘునందన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ లక్మణ్ బెంచ్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆదేసించింది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పోలీసలు రఘునందన్ రావు బంధువైన అంజన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ రూ.18 లక్షలు లభ్యమయ్యాయి. అయితే పోలీసులు కావాలనే డబ్బును ఉంచి దొరికాయని అబద్దమాడుతున్నారని బీజేపీ నాయకులు పోలీసులపై దాడికి దిగి రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో 30 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు.