https://oktelugu.com/

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ అపోలో ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల కిందటి నుంచి స్వల్ప అస్వస్థతో ఉన్న ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు రెండు రోజుల పాటు చికిత్స అవసరమని వైద్యులు ప్రకటించారు. రజనీకాంత్ ‘అన్నాత్తే’షూటింగ్ హైదరాబాద్లో జరుపుకుంటోంది. రెండు రోజుల కిందట చిత్రం యూనిట్ లో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో రజనీ టెస్టు చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే […]

Written By: , Updated On : December 25, 2020 / 01:27 PM IST
Follow us on

సూపర్ స్టార్ రజనీకాంత్ అపోలో ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల కిందటి నుంచి స్వల్ప అస్వస్థతో ఉన్న ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనకు రెండు రోజుల పాటు చికిత్స అవసరమని వైద్యులు ప్రకటించారు. రజనీకాంత్ ‘అన్నాత్తే’షూటింగ్ హైదరాబాద్లో జరుపుకుంటోంది. రెండు రోజుల కిందట చిత్రం యూనిట్ లో 8 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో రజనీ టెస్టు చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే హైబీపీ రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.