
పవన్ కల్యాణ్ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న ‘వకీల్ సాబ్ ’ చిత్రానికి సంబంధించిన ఫొటోలు లీకయ్యాయి. హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ కొందరు బయటపెట్టారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కొందరు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయన సెట్ లో ఉన్న ఫొటోలు తీసుకొని సోషల్ మీడియాల్లో షేర్ చేశారు.ఈ మేరకు కొందరు వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి.
.@PawanKalyan at #VakeelSaab shooting spot 🔥 pic.twitter.com/VzOUdSsSFD
— Pawanism Network (@PawanismNetwork) December 16, 2020