
బాలీవుడ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో రాధికా ఆప్టే పోసించిన పాత్రలో నభానటేశ్ కనిపించనుండగా.. టబు రోల్ లో తమన్నా నటిస్తోంది. ఠాగూర్ మధు, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ అయినట్లుగా నితిన్ ట్వీట్ ద్వారా తెలియపరిచారు. నితిన్ కి ఇది 30వ సినిమా. వచ్చే మార్చి కల్లా షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేశాడు. మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నితిన్, కీర్తి సురేష్ నటించిన ‘రంగ్ దే’ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది.