బాలీవుడ్ పై ఇప్పటికే కరోనా పంజా విసిరింది. శక్తికపూర్ లాంటి ప్రముఖులను బలి తీసుకుంది. కొందరు బాలీవుడ్ కు చెందిన వారు వైరస్ బారిన పడినా కోలుకున్నారు. గతంలో జయ బచ్చన్ మినహా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబ మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలసిందే. తాజాగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి […]
బాలీవుడ్ పై ఇప్పటికే కరోనా పంజా విసిరింది. శక్తికపూర్ లాంటి ప్రముఖులను బలి తీసుకుంది. కొందరు బాలీవుడ్ కు చెందిన వారు వైరస్ బారిన పడినా కోలుకున్నారు. గతంలో జయ బచ్చన్ మినహా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబ మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలసిందే. తాజాగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి క్వారంటైన్ లోకి వెళ్లారు. కాగా పాజిటివ్ వచ్చిన వారిని ముంబై ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ ఇటీవల ‘రాధే’ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన దిశా పటానీ నటిస్తున్నారు.