బండి సంజయ్‌ అక్కడే తప్పులో కాలేశాడా?

ఒక్క ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చకే దారితీసింది. రాజకీయ పరంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ స్టేట్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక వచ్చిన ఎన్నికల్లో అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీకి జలక్‌ ఇచ్చి బండి సంజయ్‌ హీరో అయ్యారు. దీంతో ఆయన పేరు సోషల్ మీడియాలోనూ మారుమోగింది. అయితే.. హటాత్తుగా నిన్నటి నుండి, అదే సోషల్ మీడియాలో బండి సంజయ్ కి విజయం తలకెక్కింది అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: బీజేపీపై పోరుకు […]

Written By: NARESH, Updated On : November 19, 2020 11:13 am
Follow us on

ఒక్క ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చకే దారితీసింది. రాజకీయ పరంగా పెద్ద దుమారమే రేపింది. బీజేపీ స్టేట్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక వచ్చిన ఎన్నికల్లో అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీకి జలక్‌ ఇచ్చి బండి సంజయ్‌ హీరో అయ్యారు. దీంతో ఆయన పేరు సోషల్ మీడియాలోనూ మారుమోగింది. అయితే.. హటాత్తుగా నిన్నటి నుండి, అదే సోషల్ మీడియాలో బండి సంజయ్ కి విజయం తలకెక్కింది అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: బీజేపీపై పోరుకు కేసీఆర్‌‌ రెడీ.. ప్లాన్ ఏంటి?

నిజంగా చెప్పాలంటే దుబ్బాకలో బీజేపీది సంచలన విజయమే. అయితే.. ఇప్పుడు ఆ విజయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆయన మీద ఉంది. విజయం సాధించడం వరకు చాలా మంది చేయగలుగుతారు.. కానీ దాన్ని నిలబెట్టుకుని కొనసాగించగలిగే వాళ్లు కొందరే ఉంటారు. రాజకీయాల్లో అలా చాలానే చూస్తుంటాం. నిన్న మొన్నటి వరకు ఒక్క చానల్ కూడా మద్దతు ఇవ్వకపోయినా బండి సంజయ్ లాంటి నేతలు చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లగలిగాయి అంటే అందుకు బలమైన కారణం సోషల్‌ మీడియానే. సోషల్‌ మీడియాలో సంజయ్‌కి ఆ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉందనే చెప్పాలి.

ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ముందుకు కొనసాగుతున్నాయని ఆ పార్టీ జాతీయ నాయకత్వం చెబుతుంటే.. సంజయ్ పవన్ కళ్యాణ్ కి దాదాపుగా షాక్ ఇస్తున్నట్లుగా ప్రకటన చేశారు. పైగా తమను ఎవరూ సంప్రదించలేదని వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో జనసేన అభిమానులు ఒకసారిగా బండి సంజయ్‌పై యు టర్న్ తీసుకున్నారు.

Also Read: కేసీఆర్, జగన్ ల మధ్య బీజేపీ చిచ్చు!

ఒకే ఒక ఉప ఎన్నికల్లో.. అది కూడా ముక్కి ముక్కి కేవలం వెయ్యి ఓట్లతో విజయం సాధించిన బండి సంజయ్ ఆ విజయాన్ని తలకు ఎక్కించుకున్నాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే నెటిజన్లు దుబ్బాక ఎన్నికల సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను విపరీతంగా వినియోగించిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు, జనసేన బరిలో లేకపోతే బీజేపీకి వేయడం కంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి వేయడం మేలు అంటూ సోషల్ మీడియాలో హింట్స్ కూడా ఇస్తున్నారు. జనసేన అభిమానులే కాదు, ఇతరులు కూడా, టీఆర్ఎస్ పార్టీ అన్ని ఉప ఎన్నికల్లో అన్ని సార్లు గెలిచినా కూడా ఎప్పుడూ ఇంతలా విర్రవీగ లేదని, బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు కేవలం ఒక్క ఉప ఎన్నికతోనే విజయాన్ని తలకెక్కించుకుంటున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతున్నాయి. ఈవీఎంల పోరులో సత్తాచాటిన బీజేపీ.. ఈ బ్యాలెట్‌లోనూ తన బలాన్ని నిరూపించుకుంటుందా చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్