Yamaha Bike Re Entry
Yamaha Rx 100 : బైక్ అంటే ఇష్టమున్న వారికి ఇదో హాట్ న్యూస్.. కొంత కాలంగా బైక్ ప్రియులకు విపరీతంగా ఆకట్టుకున్న యమహా Rx 100 గుర్తుందా? 1990 దశకం యువతకు ఈ బైక్ గురించి తెలియకుండా ఉండరు. కాలేజీకి వెళ్లే వారికి ఈ బైక్ ఉంటే హోదాగా ఫీలయ్యేవారు. ఆ కాలంలో ఈ బండి విపరీతంగా అమ్మకాలు జరుపుకుంది. ముఖ్యంగా ఇందులో నుంచి వచ్చే సౌండ్ మరే బైక్ సెట్ చేయలేదు. ఇప్పటికే యమహా పాత వెహికల్స్ ను వాడుతున్నారు. అందుకు ఈ బండికి ఉన్న సౌండ్ మాత్రమే అని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికొస్తే .. యమహా ఆర్ ఎక్స్ మళ్లీ రాబోతుంది. అయితే ఆర్ ఎక్ష్ 100 గా కాదు.. ఎలాగంటే?
ఒకప్పుడు ట్రెండీగా మారిన వాహనాలను కొన్ని కంపెనీలు తిరిగి మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు వాటిపై ఉన్న మక్కువతో రీ సేల్ జరగొచ్చనే ఆలోచనతో పాత వాహనాలను ఇప్పటి ట్రెండీకి అనుగుణంగా మార్చి అందుబాటులోకి తీసుకురాబోతుంది.1990లో ఒక ఊపు ఊపిన యమహా బైక్ ను 1996 మార్చిలో ఉత్పత్తి ఆపేశారు. కానీ ఇప్పటికీ దానిని మరిచపోకుండా పాత బండ్లను వాడుతూనే ఉన్నారు.
అయితే ఇదే బైక్ ను ఇప్పుడు బీఎస్ 6 ఫేస్ 2 మిషన్ రూల్స్ కి తగ్గట్లుగా మార్చబోతుంది. పాత యమహా లో ఆర్ ఎక్స్ 100 సీసీ ఇంజిన్ తో పనిచేసేది. కానీ ఇప్పుడు కొత్త బైక్ లో 225.9 సీసీ ఇంజిన్ ను వాడబోతున్నారు. అలాగే 20.1 హెచ్ పీ పవర్, 19.93 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేసేలా సెట్ చేయనున్నారు. అంతేకాకుండా యమహా పేరు కూడా మరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త యమహా ఐకానిక్ ఆర్ ఎక్స్ 100 ఆధారంగా రూపొందుతుంది.
పాత యమహాలో 100 సీసీతో పాటు స్లీక్ లైట్ వెయిట్ డిజైన్ ఉండేది. సౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొత్త దానిలో సౌండ్ ఎలా అమరుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. బరువు కూడా పెరుగొచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొత్తగా వచ్చే వెహికల్ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాని కొన్ని నివేదికలు మాత్రం దీనిని తిరిగి తీసుకొస్తారని అంటున్నారు.