https://oktelugu.com/

xuv700 mx 7 seater : మహీంద్రా నుంచి XUV700 MX లాంచ్.. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

ఈ మోడల్ మొత్తం 5 కలర్లో లభిస్తుంది. ఇందులో రెడ్ రేజ్, మిడ్ నైట్ బ్లాక్, డాజ్లింగ్ రెడ్, ఎవరెస్ట్ వైట్, నాపోలి బ్లాక్ కలర్స్ ఉన్నాయి. XUV700 MX ధర విషయానికొస్తే రూ.15 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2024 / 11:16 AM IST

    xuv700 mx 7 seater

    Follow us on

    xuv700 mx 7 seater : SUV కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రా కంపెనీ ముందు ఉంటుంది. ఇప్పటి వరకు దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎన్నో మోడళ్లు సక్సెస్ అయ్యాయి. వీటిలో బొలెరో, థార్ వంటివి ఉన్నాయి లేటేస్గుగా మహీంద్రా నుంచి XUV700 MX అనే మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కారు కొనాలనుకునేవారు ఎక్కువగా ఎస్ యూవీలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మహీంద్రా కొత్తగా XUV700 MX ను లాంచ్ చేసింది. 7 సీటర్ కలిగిన దీని ధర కూడా తక్కువగానే ఉంది. మహీంద్రా కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన MX 5సీటర్ కంటే ఇది రూ.3 లక్షల తగ్గింపు ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..

    XUV700 MX కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ లేదనే విషయాన్ని గుర్తించాలి. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కు కలిగిన ఇందులో 7 గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లొచ్చు. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఆండ్రాయిడ్ సిస్టమ్, సౌండింగ్ కోసం 4 స్పీకర్లు, మల్టీపుల్ యూఎస్ బీ పోర్ట్, అడ్జస్టబుల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వంటి ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి.

    ఈ మోడల్ మొత్తం 5 కలర్లో లభిస్తుంది. ఇందులో రెడ్ రేజ్, మిడ్ నైట్ బ్లాక్, డాజ్లింగ్ రెడ్, ఎవరెస్ట్ వైట్, నాపోలి బ్లాక్ కలర్స్ ఉన్నాయి. XUV700 MX ధర విషయానికొస్తే రూ.15 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. అయితే ఇదివరకే మార్కెట్లో ఉన్న AX3 కంటే తక్కువే అని చెప్పొచ్చు. కానీ మహీంద్రా MX 5 సీటర్ కంటే రూ.40 వేలు ఎక్కువ అని చెప్పాలి. అయితే కొత్తగా ఎస్ యూవీ కారు కొనాలనుకునేవారికి మాత్రం ఇది మంచి ఎంపిక అని అంటున్నారు.

    దేశీయ మార్కెట్లో 7 సీటర్ డీజిల్ వెర్షన్లు టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటి కంటే కూడా XUV700 MX ధర తక్కువే అని తెలుస్తుంది. మహీంద్రా కార్లకు ఇప్పటికే క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ కంపెనీ కారు కావాలనుకునేవారు XUV700 MX సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం కలుగుతుంది.