https://oktelugu.com/

Dead Person: మరణించిన వ్యక్తికి సంబంధించిన ఈ వస్తువలు అస్సలు వాడకూడదట.. ఎందుకంటే?

కొందరు ప్రముఖ జ్యోతిష్యులు తెలుపుతున్న ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తికి సంబందించి ఎటువంటి ఆనవాళ్లు ఉండకూడదని అంటున్నారు. ముఖ్యంగా ఆ వ్యక్తి బతికున్నప్పుడు వాని బెడ్ షీట్ లేదా మంచం ఉంటే వెంటనే వాటిని పారేయాలని చెబుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2024 / 11:19 AM IST

    Dead person soul

    Follow us on

    Dead Person:  పుట్టే వ్యక్తి గిట్టక మానడు. ఉన్నంత సేపు ఆ వ్యక్తి చేసిన పనులు, గుర్తులు మిగిలిపోతాయి. అలాగే ఆ వ్యక్తి తిరిగిన ప్రదేశాలు, ధరించిన దుస్తులు, వేసుకున్న ఆభరణాలు చూసినప్పుడల్లా ఆ వ్యక్తి పదే పదే గుర్తుకు వస్తాడు. ఈ నేపథ్యంలో కొందరు మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆభరణాలను అపురూపంగా చూసుకుంటారు. కొందరు వారు వేసుకున్న వస్తువులను వారిపై ప్రేమ ఉన్న వారు ధరిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల చాలా నష్టపోతారని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు వాడితే ఏమవుతుందో తెలుసా?

    కొందరు ప్రముఖ జ్యోతిష్యులు తెలుపుతున్న ప్రకారం ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తికి సంబందించి ఎటువంటి ఆనవాళ్లు ఉండకూడదని అంటున్నారు. ముఖ్యంగా ఆ వ్యక్తి బతికున్నప్పుడు వాని బెడ్ షీట్ లేదా మంచం ఉంటే వెంటనే వాటిని పారేయాలని చెబుతున్నారు. ఎందుకంటే ఆత్మ తిరిగి రావడానికి ఈ వస్తువులు వారికి కారకాలుగా ఉంటాయి. ఈ వస్తువులను బతికున్నవారు ఉపయోగిస్తే వారికి కష్టాలు ఉంటాయని అంటున్నారు.

    కొందరు స్త్రీలు మరణించిన తరువాత వారికి సంబంధించిన ఆభరణాలను బతికున్న వారు ధరించాలని చూస్తారు. అయితే వీటిని పారేయడం కుదరదు. అలాగని వాటిని నేరుగా ధరించినా మంచిది కాదు. అందువల్ల అటువంటి లోహాలను వెంటనే కరిగించి ఆ తరువాత కొత్త ఆభరణాలు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రేతాత్మ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బంగారం లేదా వెండికి సంబందించిన వస్తువులు రీ మేకింగ్ చేయించుకోవాలి.

    మరణించిన వ్యక్తికి సంబంధించిన దుస్తులు, వస్తువులను ఎక్కడ పడితే అక్కడ కాకుండా పారే నీళ్లలో కలపడం మంచిది. ఇలా చేయడం వల్ల వారి ఆ వస్తువులు ఉపయోగించిన వారి ఆత్మ శాంతిస్తుంది. అయితే ఈ అవకాశం లేని వారు దూర ప్రదేశాల్లో పడేయవచ్చు. ఏదీ ఏమైనా మరణించిన వ్యక్తికి సంబందించిన వస్తువులు ఇంట్లో ఉంటే ఆత్మ తిరిగి రావడానికి ప్రయత్నిస్తుందని గరుడ పురాణం చెబుతుంది.