Homeబిజినెస్Xiaomi Redmi Note 15: తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ ఇది.. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో...

Xiaomi Redmi Note 15: తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ ఇది.. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసా?

Xiaomi Redmi Note 15: స్మార్ట్ ఫోన్ లు విస్తృతంగా మార్కెట్ ను ముంచెత్తుతున్న నేటి కాలంలో.. చాలామంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న వాటిని కోరుకుంటారు. అది భారతీయుల లక్షణం కూడా. నేటి పోటీ కాలంలో ఫోన్ లో ఎక్కువ ఫీచర్లను అన్ని కంపెనీలు అందిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ధర కూడా ప్రకటిస్తున్నాయి. అయితే కొంతమంది వినియోగదారులు ఎక్కువ ఫీచర్లను కోరుకుంటారు, ధర తక్కువగా ఉండాలని భావిస్తారు. అటువంటి వారికి xiaomi Redmi note 15 మంచి ఎంపిక.

2026 సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించడానికి xiaomi బలమైన ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో భాగంగానే Red me note 15 ను తెరపైకి తీసుకొచ్చింది.. ఇందులో అద్భుతమైన ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ రూపొందించినట్టు xiaomi company చెబుతోంది.

ఫీచర్లు ఏంటంటే

Xiaomi Note 15 సిరీస్ లో Snapdragon 6 Gen 3 చిప్ సెట్ ఆధారంగా నడుస్తుంది. 120 Hz రీ ఫ్రెష్ రేట్, 3,200 నిట్ ల గరిష్టమైన brightness, 6.67 అంగుళాల curved AMOLED డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. దీనికి TUV సర్టిఫైడ్ ఐ కేర్, వెట్ టచ్ సపోర్టు లభిస్తుంది. కెమెరా సెట్ అప్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రధాన ఆకర్షణ. తక్కువ కాంతిలో కూడా 3x ఇన్ సెన్సార్ జూమ్ తో ఫోటోలు తీయవచ్చు. 108 mp Samsung ISOCELL hm 9 సెన్సార్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తూ ఉంటుంది.

5,520 ఎం ఏ హెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్డ్ చార్జింగ్ ఈ ఫోన్లో ఉన్న ప్రధాన ప్రత్యేకత. ఈ ఫోన్ కు నాలుగు సంవత్సరాల ఓ ఎస్ అప్ గ్రేడ్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లభిస్తుందని xiaomi చెబుతోంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ 20 30 వరకు, సెక్యూరిటీ ప్యాచ్ 2032 వరకు లభిస్తాయని తెలుస్తోంది. ఈ ఫోన్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. బడ్జెట్ రేంజిలో ప్రీమియం స్థాయిలో కనిపిస్తోంది. 2026 లో ఈ సిరీస్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోతాయని xiaomi కంపెనీ చెబుతోంది.

Xiaomi కంపెనీ తయారుచేసిన ఉత్పత్తుల్లో రెడ్ మీ సిరీస్ అత్యుత్తమమైనది. అయితే ఈ సిరీస్లో ఈ కాలంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టింది కంపెనీ. పైగా దీని ధరను బిల్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ప్రజలు కొనుగోలు చేసే విధంగా నిర్ణయించింది. అన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు, ఆఫ్లైన్ స్టోర్లలో ఈ సిరీస్ ఫోన్ లను షావోమి కంపెనీ అందుబాటులో ఉంచింది.. ధర 15 నుంచి 20 వేల మధ్యలో ఉంటుందని కంపెనీ చెప్పింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular