World`s Oldest Billionaire : ఫోర్బ్స్ వెల్లడించిన జాబితా ప్రకారం 2023 సంత్సరానికి అత్యంత వృద్ధ మిలియనీర్లలో భారత్ కు చెందిన కేషుబ్ మహీంద్రా పేరును చేర్చింది. మహీంద్రా అండ్ మహీంద్రాలో పనిచేసిన ఆయన ప్రపంచంలోనే అత్యధిక వయసున్న ధనవంతుడు అని పేర్కొన్నారు. అయితే అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి మరొకరు ఉన్నారు. కేషుబ్ మహీంద్రా కంటే ఎక్కువ వయసు, ఎక్కువ సంపాదనను కలిగి ఉన్నారని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే..
భారత్ కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యవస్థాపక నేత కేషుబ్ మహీంద్రా (99) ఆగస్టు 9న మరణించారు. ఈ కంపెనీ ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహేంద్రకు కేషుబ్ మేనమామ అవుతారు. 1947లో మహీంద్రా గ్రూప్ లో చేరిన కేషుబ్ 1963లో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు కంపెనీకి నాయకత్వం వహించారు. 2012లో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే 2023 ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో భారతదేశంలో అత్యంత వృద్ధ బిలియనీర్ గా పేర్కొన్నారు. కానీ అంతకంటే వృద్ధుడైన బిలియనీర్ మరొకరు ఉన్నారని ఓ ఆంగ్ల పత్రిక డీఎన్ ఏ ప్రకటించింది.
కేషుబ్ మహీంద్రా కంటే వృద్ధ బిలియనీర్ మరొకరు ఉన్నారని, ఆయన పేరు జార్జ్ జోసెఫ్ అని ఆ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ప్రపంచంలోనే ఏకైక బిలయనీర్ ఇతనే అని తెలిపింది. అమెరికాలోని వైమానిక దళ నావిగేటర్ లో పనిచేసిన జార్జ్ 1962లో గ్రీక్ గాడ్ పేరు మీద మెర్క్యురీ జనరల్ పేరుతో బీమా కంపెనీని స్థాపించాడు. ఆ సమయంలో జోసెఫ్ రాయితీ ఒప్పందాలతో సగటు డ్రైవర్ల కంటే సురక్షితమైన బీమా ప్రొవైడర్ ను ప్రారంభించడానికి 2 మిలియన్ డాలర్లను సేకరించారు. ప్రస్తుతం ఆయన వయసు 101 ఏళ్లు. అంతేకాకుడా ఆయన నికర విలువ 1.3 బిలియన్ డాలర్లు. అయితే ఫోర్బ్స్ ప్రకటించిన ప్రకారం కేషుబ్ ఆదాయం 1.2 బిలియన్ డాలర్లు.
అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న జోసెఫ్ తనకు వచ్చిన సంపదనంతా మెర్క్యురీ జనరల్ పెట్టాడు. ఇది క్రమంగా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మారింది. ఇందులో ఆయనకు 34 వాతం వాటా ఉంది. వాహనం, ఇల్లు, అగ్నిమాపక బీమాను అందించడంలో ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇలా ఈ కంపెనీ అభివృద్ధి సాధించడంతో జోసెఫ్ ప్రపంచంలోనే అత్యంత బిలియనీర్ గా మారాడు. లెబనాన్ నుంచి వలస వచ్చింది వీరి కుటుంబం. అతని తండ్రి చిన్న కిరాణం షాపు నడిపేవాడు.