https://oktelugu.com/

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. అలా చేస్తే బెనిఫిట్స్ కోల్పోయినట్లే..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈపీఎఫ్ ఖాతాలో ప్రతి నెలా ఎంప్లాయ్ డబ్బులతో పాటు ఎంప్లాయర్ డబ్బులు కూడా జమవుతాయి. కొంతమంది ఉద్యోగులు ఉద్యోగం చేసినన్ని రోజులు ఈపీఎఫ్ ఖాతాను కొనసాగిస్తే మరి కొందరు మాత్రం ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేయడం సరైన నిర్ణయం కాదు. పీఎఫ్ ఖాతాను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 7, 2021 / 10:32 AM IST
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈపీఎఫ్ ఖాతాలో ప్రతి నెలా ఎంప్లాయ్ డబ్బులతో పాటు ఎంప్లాయర్ డబ్బులు కూడా జమవుతాయి. కొంతమంది ఉద్యోగులు ఉద్యోగం చేసినన్ని రోజులు ఈపీఎఫ్ ఖాతాను కొనసాగిస్తే మరి కొందరు మాత్రం ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేయడం సరైన నిర్ణయం కాదు.

    పీఎఫ్ ఖాతాను ఓపెన్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు కాకుండా పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేస్తే పన్ను ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాలకు ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఐదు సంవత్సరాల లోపు పీఎఫ్ ఖాతాలో నగదును విత్ డ్రా చేసిన వాళ్లు ఈ బెనిఫిట్ ను కచ్చితంగా పొందలేరు.

    అలా కాకుండా ఒక ఈపీఎఫ్ ఖాతా నుంచి మరో ఈపీఎఫ్ ఖాతాకు నగదును జమ చేస్తే మాత్రం ఈ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నవాళ్లు 10 సంవత్సరాల వరకు డబ్బును జమ చేస్తే 58 సంవత్సరాల తర్వాత పెన్షన్ లభిస్తుంది. 58 ఏళ్లకు ముందే పదవీ విరమణ చేసి ఈపీఎస్‌లో 10 సంవత్సరాల పాటు డబ్బును జమ చేస్తే వాళ్లు కూడా పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

    ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కట్ అయిన నగదు ఈపీఎఫ్, ఈపీఎస్ ఖాతాలలో జమవుతుంది. ఈపీఎస్‌లోకి 8.33 శాతం, ఈపీఎఫ్‌లో 3.67 శాతం జమ కావడం జరుగుతుంది. పీఎఫ్ ఖాతాదారులు కచ్చితంగా ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోతే మాత్రం ఈపీఎఫ్ ఖాతాల్లోకి డబ్బును జమ చేసే విషయంలో సంస్థకు ఇబ్బందులు తలెత్తుతాయి.