- Telugu News » Ap » Another case against bhuma akhilapriyas husband
భూమా అఖిలప్రియ భర్తపై మరో కేసు
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదైంది. నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ సమర్పించారని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో భార్గవ్ రామ్, జగన్ విఖ్యాత్ పై కేసు నమోదు చేశారు. బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో వీరిద్దరూ ఈ నెల 3న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విచారణకు హాజరుకాలేమని ఈనెల 1న కోర్టులో నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు అభియోగం నమోదైంది. […]
Written By:
, Updated On : July 7, 2021 / 10:19 AM IST

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, సోదరుడిపై మరో కేసు నమోదైంది. నకిలీ కొవిడ్ సర్టిఫికెట్ సమర్పించారని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో భార్గవ్ రామ్, జగన్ విఖ్యాత్ పై కేసు నమోదు చేశారు. బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో వీరిద్దరూ ఈ నెల 3న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విచారణకు హాజరుకాలేమని ఈనెల 1న కోర్టులో నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు అభియోగం నమోదైంది. నకిలీ ధ్రువపత్రం ఇచ్చిన ముగ్గురు ఆస్పత్రి సిబ్బిందిపై కూడా కేసు నమోదు చేశారు.