https://oktelugu.com/

హ‌మ్మ‌య్య‌.. జీతాలు, పెన్షన్లకు ఏపీకి అప్పు పుట్టింది!

ఇవాళ తారీఖు ఏడు. కానీ.. ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఉద్యోగుల్లో అంద‌రికీ జీతం అంద‌లేదు. పెన్ష‌న‌ర్ల‌కూ ఇదే పరిస్థితి. దీనికి కార‌ణం.. ఖ‌జానా ఖాళీగా ఉండ‌డ‌మే. అందుబాటులో ఉన్న డ‌బ్బును ఉద్యోగుల అకౌంట్ల‌లో జ‌మ చేశారు. మిగిలిన వాళ్ల‌ను వెయిటింగ్ లిస్టులో పెట్టారు. వీళ్లంద‌రికీ ఇవాళ జీతాలు అంద‌నున్నాయి. 2 వేల కోట్ల రూపాయ‌ల అప్పును ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీక‌రించ‌డంతో ఈ నెల గండం గ‌ట్టెక్కింది. ప్ర‌తీ మంగ‌ళ‌వారం రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు […]

Written By:
  • Rocky
  • , Updated On : July 7, 2021 / 10:42 AM IST
    Follow us on

    ఇవాళ తారీఖు ఏడు. కానీ.. ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఉద్యోగుల్లో అంద‌రికీ జీతం అంద‌లేదు. పెన్ష‌న‌ర్ల‌కూ ఇదే పరిస్థితి. దీనికి కార‌ణం.. ఖ‌జానా ఖాళీగా ఉండ‌డ‌మే. అందుబాటులో ఉన్న డ‌బ్బును ఉద్యోగుల అకౌంట్ల‌లో జ‌మ చేశారు. మిగిలిన వాళ్ల‌ను వెయిటింగ్ లిస్టులో పెట్టారు. వీళ్లంద‌రికీ ఇవాళ జీతాలు అంద‌నున్నాయి. 2 వేల కోట్ల రూపాయ‌ల అప్పును ఇచ్చేందుకు ఆర్బీఐ అంగీక‌రించ‌డంతో ఈ నెల గండం గ‌ట్టెక్కింది.

    ప్ర‌తీ మంగ‌ళ‌వారం రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వేల కోట్ల రూపాయ‌ల రుణం తీసుకుంటోంది ఏపీ స‌ర్కారు. బాండ్ల వేలం ద్వారా ఈ రుణాల‌ను స‌మీక‌రిస్తోంది. వ‌డ్డీ రేటు ఎక్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. ఖ‌జానా ఖాళీఅవ‌డంతో ఏపీకి అనివార్య ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. అయితే.. గ‌త‌ వారం రావాల్సిన అప్పుల విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. దీంతో.. ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ వెళ్లి.. అప్పు సాధించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించి, స‌క్సెస్ అయ్యారు. ప్ర‌తినెలా ఇదే ప‌రిస్థితి ఉంటోంది.

    ఏపీ స‌ర్కారు రుణ ప‌రిమితిని కూడా కేంద్ర ప్ర‌భుత్వం బాగా త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మొత్తం రూ.42,472 కోట్ల బ‌హిరంగ మార్కెట్ రుణం తీసుకునేట్టుగా లెక్క తేల్చారు ఏపీ ఆర్థిక‌శాఖ‌ అధికారులు. కానీ.. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు భారీగా కోత‌లు పెట్టారు. దాని ప్ర‌కారం.. రూ.27,668 కోట్ల‌కు మించి రుణాలు తీసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

    రాష్ట్రానికి ఉన్న రుణ ప‌రిమితి క‌న్నా అద‌నంగా గ‌త సంవ‌త్స‌రాల్లోనే అప్పులు తీసుకున్న‌ట్టు కూడా కేంద్రం గుర్తించింది. ఈ మొత్తం 17,923 కోట్లుగా నిర్ధారించింది. ఇదేకాకుండా.. ఇత‌ర‌త్రా అప్పులు మ‌రో 6 వేల కోట్లు ఉన్న‌ట్టు తేల్చింది. ఇవ‌న్నీ లెక్క‌లోకి తీసుకొని కోతలు పెట్టింది కేంద్రం. దీంతో.. ఇప్పుడు రాష్ట్రం తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న అప్పు కేవ‌లం 27,668 కోట్లు మాత్ర‌మే.

    అంతేకాదు.. రిజ‌ర్వు బ్యాంకు నుంచి ప్ర‌తీవారం సేక‌రిస్తున్న 2 వేల కోట్ల బాండ్ల అప్పులను కూడా ఇక నుంచి ఇవ్వొద్ద‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే భారీగా అప్పులు చేసిన నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ ఆర్బీఐ అప్పు ఇవ్వ‌క‌పోతే మాత్రం మ‌రింత ఇబ్బందులు ఎదుర‌వ్వ‌డం ఖాయం. మ‌రి, రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.