KTM bike craze drop:కావాల్సినంత డబ్బు ఉండి.. రాణించడానికి కార్లు ఉన్న కొంతమంది యువత BIkes పై ప్రయాణం చేస్తేనే కిక్ ఉంటుందని అంటూ ఉంటారు. బైక్ పై ప్రయాణం చేయడం వల్ల కొత్త ఉత్సాహం ఉంటుంది. అయితే ఆ ఉత్సాహం రావాలంటే వారికి అనుగుణమైన బైక్ ఉండాలి. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆకట్టుకునే వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. అలాంటి కంపెనీలో KTM గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మొదట్లో ఇనుమును మాత్రమే తయారు చేసే ఈ సంస్థ ఆ తర్వాత బైక్స్ ను తయారుచేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే కొద్ది కాలంలోనే ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. దీని నుంచి వెలువడిన బైక్స్ యువత ఎక్కువగా కొనుగోలు చేసేవారు. కానీ ఆ తర్వాత ఈ బైక్స్ అమ్మకాలు చాలా వరకు పడిపోయాయి. 2024 సంవత్సరంలో 12% బైక్ అమ్మకాలు క్షీణించాయి. ఇలా అమ్మకాలు పడిపోవడానికి కారణం ఏంటంటే?
Also Read: ఎస్‌బీఐకి జాక్‌పాట్.. త్వరలో ఖాతాలోకి రాబోతున్న రూ.25,000 కోట్లు
ఆస్ట్రియా దేశానికి చెందిన హన్స్ ట్రంకెన్ polz అనే ఇంజనీరింగ్ శాస్త్రవేత్త 1934లో ప్రారంభించిన కంపెనీలో ఇనుప వస్తువులను తయారు చేసేవారు. ఆ తర్వాత 1951 లో 100 సిసి తో R 100 అనే బైక్ ను తొలిసారిగా విడుదల చేశారు. ఇదే సమయంలో కంపెనీ పేరును KTM గా మార్చారు. KTM అంటే Kraftfahrzeuge Trunkenpolz Mattighofen.
అయితే 2007 సంవత్సరంలో బజాజ్ కంపెనీ తో ఒప్పందం అయిన కెటిఎమ్ ఆ తర్వాత 2012 నుంచి సేల్స్ ను విపరీతంగా పెంచుకుంది. ఎందుకంటే గతం కంటే బజాజ్ కంపెనీ తో ఒప్పందం జరిగిన తర్వాత బైక్ ధరలు చాలావరకు తగ్గాయి. అంతేకాకుండా ఈ బైక్ స్టైలిష్ గా ఉండడంతోపాటు అడ్వాన్స్ ఫీచర్స్ ఎక్కువగా ఆకర్షించడంతో చాలామంది కొనుగోలు చేశారు. అయితే ఈ బైక్ ను కొంతమంది తప్పుడు పనులకు ఉపయోగించడం వల్ల సేల్స్ తగ్గిపోయాయి.
యూత్ దీనిని కొనుగోలు చేస్తూ బైక్ రేసింగ్ కోసం ఎక్కువగా యూజ్ చేసేవారు. అలాగే కొందరు అమ్మాయిల కోసమే కొనుగోలు చేశారని అన్నారు.. ఈ క్రమంలో పేటీఎం బైక్ కు ఒక ట్యాగ్ లైన్ ను చేర్చారు. అదే Chapri. ఈ ట్యాగ్ లైన్ తో చాలామంది కెటిఎమ్ బైకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ బైక్ కేవలం రేసింగ్ కోసమే నంటూ ప్రచారం చేయడంతో చాలామంది దీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
Also Read: ఇండియన్ మార్కెట్లో టెస్లా నిలబడగలదా?
ఈ క్రమంలో KTM బైక్ సేల్స్ 2024 సంవత్సరంలో 12% క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన కెటిఎమ్ 200, 250 సిరీస్ యూత్ ను విపరీతంగా ఆకర్షించాయి. అయినా మే 2024లో దేశీయంగా 4525 యూనిట్లకు పడిపోయింది. ఇది మే 2023లో జరిగిన అమ్మకాల కంటే 11.53 శాతం తక్కువ అని తెలుస్తోంది. కానీ కంపెనీ అవి ఏమి పట్టించుకోకుండా యూత్ ను ఆకర్షించేందుకు కొత్త రకమైన వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం కెటిఎమ్ నుంచి 6 కొత్త మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.