
భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 319 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 17 దరఖాస్తులకు చివరి తేదీగా ఉంది.
https://www.vizagsteel.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 319 ఉద్యోగ ఖాళీలలో ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 75, టర్నర్ ఉద్యోగ ఖాళీలు 10, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలు 20, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) ఉద్యోగ ఖాళీలు 40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఉద్యోగ ఖాళీలు 20, ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 60, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 20, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్ ఉద్యోగ ఖాళీలు 14 ఉన్నాయి.
ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు మెకానిక్ డీజిల్ ఉద్యోగ ఖాళీలు 30, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండటంతో పాటు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ పరీక్ష జరుగుతుంది.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా https://www.vizagsteel.com/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.