HDFC Merger: గత కొన్నిసంవత్సరాలుగా బ్యాంకులన్నీ విలీనం అవుతున్నాయి. అంతకుముందు ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంకులు యూనియన్ బ్యాంకులో కలిసిపోయాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ HDFC BANKలో HDFC వీలీనమవుతున్నట్లు ప్రకటించారు. మార్టిగేజ్ సంస్థగా ఉన్న HDFCని HDFC BANKలో విలీనం చేయడంతో కస్టమర్లు అయోమయంలో పడ్డారు.ఎందుకంటే ఇప్పటి వరకుHDFC లో లోన్ తీసుకున్నవారికి వడ్డీ రేట్లు పెరుగుతాయా…? లేక అలాగే ఉంటాయా? అనేది తెలియక సతమతమవుతున్నారు. ఈ విషయాలపై కొందరు బ్యాంకుకు వెళ్లితెలుసుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికోసం మేమందించే వివరాలివే..
2023 జూలై 1 నుంచిHDFC BANKలో HDFC Limited విలీనమవుతుంది. భారతదేశంలోనే ప్రముఖ సంస్థగా కొనసాగుతున్న హెడ్ డీఎఫ్ సీ లిమిటెడ్ బ్యాంకులో కలిసిపోవడంతో ఇప్పుడు రూ.18 కోట్ల ఆస్తులతో దిగ్గజ బ్యాంకుగా ఏర్పాటైనట్లయింది. ప్రస్తుతం HDFC BANK లో 12కోట్ల కస్టమర్లు, 8300 బ్యాంచ్ లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఈ సంస్థల్లో 1.77 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెడ్ డీఎఫ్ లిమిటెడ్ లో ఇప్పటి వరకు లోన్ తీసుకున్న వారికి వడ్డీ రేట్లు అలాగేఉంటాయా? లేక పెరుగుతాయా? అనేసందేహ చాలా మందిలోఉంది.
బ్యాంకు వర్గాలు చెబుతున్నప్రకారం హెచ్ డీ ఎఫ్ సీలిమిటెడ్ లో ఖాతా ఉన్నవారు ఇప్పుడు HDFC BANKలోకి మారుతారు. అయితే ఇప్పటి వరకు లోన్ తీసుకున్నవారు తమ ఖాతా లేదా.. ఐడీ నెంబర్ ఏవీ మారవు. ఈ ఖాతాదారులు తీసుకున్న వడ్డీ రేట్లలోనూ ఎలాంటిమార్పులు ఉండవు. అయితే భవిష్యత్ లో ఈబీఎల్ ఆర్ కు అనుగుణంగా మార్పులుఉండొచ్చ అని అంటున్నారు. అయితే కొందరు ప్రీ క్లోజ్ చేసుకోవాలనుకునేవారు మాత్రం బ్యాంకులను సంప్రదించవచ్చు.
HDFC లిమిటెడ్ లో అకౌంట్ ఉండి HDFC BANKలో లేని వారు పాతలాగిన్ తోనే ఎంట్రీ కావాల్సి ఉంటుంది. ఇక HDFC లిమిటెడ్ లో ఫిక్స్ డ్ డిపాజిట్లుచేసిన వారు అలాగే కంటిన్యూ చేయడం బెటర్. వాటి మెచ్యూరిటీ, రెన్యూవల్ అయ్యేవరకే ప్రస్తుతం ఉన్న వడ్డీనే కొనసాగుతుంది. వాటి నిబంధనలుకూడా అలాగే ఉంటాయి. అయితే హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ వివరాలను HDFC BANKలో తెలుసుకోవాలంటే మాత్రం సాధ్యం కాదు. పాత అకౌంట్ ను క్లోజ్ చేసి కొత్త అకౌంట్ ప్రారంభిస్తేనేHDFC BANKలోఖాతాదారులుగా మారుతాయి. మరిన్నివిషయాలు తెలుసుకోవాలంటేమాత్రం బ్యాంకు అధికారులను సంప్రదించాలి.