Motorola Moto Edge 50 : మోటారొలా నుంచి కొత్త గాడ్జెట్.. ధర చూస్తే షాకింగే..

ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల ఆఫర్ లభిస్తంుది. ప్లిఫ్ కార్డు ద్వారా పాత ఫోన్ ఎక్చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల తక్కువకే వస్తుంది.

Written By: NARESH, Updated On : May 17, 2024 5:45 pm

Motorola Moto Edge 50

Follow us on

Motorola Moto Edge 50 : మార్కెట్లోకి కొత్త గాడ్జెట్ వస్తూ అలరిస్తూ ఉంటాయి. లేటేస్ట్ గా మోటారొలా కంపెనీ నుంచి ‘మోటో ఎడ్జ్ 50’ని మే 16న విడుదల చేయశారు. 5జీ నెట్ వర్క్ కు ఉపయోగపడే ఈ మొబైల్ అప్డేట్ టెక్నాలజీతో పాటు కొత్త ఫీచర్లను అమర్చారు. భారత్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ వివరాల్లోకి వెళితే..

మోటో ఎడ్జ్ 50 ఫ్యూజియన్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. లైట్ వెయిట్ తో ఉన్న ఈ మొబైల్ చాలా సన్నగా ఉంటుంది. మోటారోలా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వాటిలో ఇదే సన్నగా ఉంటుందని తెలుస్తుంది. మటారోలా ఎడ్జ్ ఫ్యూజన్ 6 నుంచి 7 అంగుళాల హెచ్ డీ 3 డీ కన్వర్టెడ్ డిస్ ప్లే తో పాటు హై రిఫ్రెష్ రేట్ 144 హెచ్ జెడ్ 1600 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెస్ రేట్ 144 హెచ్ జడ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారితమైన ఈ మొబైల్ 4 ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 ప్రాజెస్ పనిచేస్తుంది.

ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సల్ కలిగిన ప్రధాన కెమెరా ఉంది. అలాగే ఇందులో సోనీ ఎల్ వైటీ 700 సీ సెన్సార్, 1.88 అసెర్చర్ ను అమర్చారు. అలాగే ఇందులో 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈమొబైల్ 5 జీతో పాటు 4 జీ నెట్ వర్క్ ను కలిగి ఉంది. ఎల్ టీటీఈ వైఫై 6 , బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆప్షన్లు ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా డిస్ ప్లేను కలిగిన దీనిలో 7 ఎస్ జనరేషన్ 2 చిప్ సెట్ తో మల్టీ టాస్కింగ్ ను కలిగి ఉంది.

ఈ మొబైల్ 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ధర లోకి వెళ్తే 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ను రూ.22,999 తో విక్రయిస్తున్నారు. దీనిని మొత్తం అమౌంట్ తో కాకుండా క్రెడిట్ కార్డు ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల ఆఫర్ లభిస్తంుది. ప్లిఫ్ కార్డు ద్వారా పాత ఫోన్ ఎక్చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల తక్కువకే వస్తుంది.