Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Anasuya Bharadwaj: అంతులేని ఆనందంలో అనసూయ... బయటకు వెళితే ఇలా ఎంజాయ్ చేస్తుందా? ఫోటోలు వైరల్!

Anasuya Bharadwaj: అంతులేని ఆనందంలో అనసూయ… బయటకు వెళితే ఇలా ఎంజాయ్ చేస్తుందా? ఫోటోలు వైరల్!

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఒకప్పటి స్టార్ యాంకర్. యూత్ లో అమ్మడుకు విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఆమె షేర్ చేసే పోస్ట్స్ వైరల్ అవుతుంటాయి. కాగా మే 15న అనసూయ తన 39వ పుట్టిన రోజు జరుపుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి చెక్కేసిన అనసూయ.. అక్కడే బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంది. పనిలో పనిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.

తన భర్త సుశాంక్ భరద్వాజ్, పిల్లలతో కలిసి ఫుల్ ఫన్ మోడ్ లో ఉంది. పొట్టి బట్టలు ధరించి ఫుల్ రచ్చ చేస్తుంది. క్రేజీ లుక్ లో ఆకట్టుకుంటుంది. కొండల్లో, కోనల్లో తిరుగుతూ తన భర్తతో రొమాంటిక్ ఫోజులు ఇస్తుంది. మినీ డ్రెస్ లో జలపాతాల దగ్గర జలకాలు ఆడుతుంది. కంప్లీట్ గా ట్రెండీ లుక్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

అనసూయ కెరియర్ విషయానికి వస్తే .. గత ఏడాది అనసూయ విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం. రంగ మార్తాండ, మైఖేల్ వంటి చిత్రాల్లో నటించింది. విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనసూయ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 లో నటిస్తుంది. అనసూయ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీం ఆమె లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ కిల్లర్ లేడీ గా కనిపిస్తుంది.

పుష్ప లో ఆమె నటించిన దాక్షాయణి పాత్రకు భారీ రెస్పాన్స్ దక్కింది. మరోసారి లేడీ విలన్ దాక్షాయణిగా మెప్పించనుంది. దీనితో పాటు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇక అనసూయ బుల్లితెరకు దూరమైన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి నటిగా మారిపోయింది. యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. సినిమాల్లో విరివిగా అవకాశాలు రావడంతో 2022 లో జబర్దస్త్ షో మానేసింది.

Exit mobile version