Virtual Credit Card: వర్చువల్‌ క్రెడిట్ కార్డ్‌ అంటే ఏంటి? దానిని ఎలా వాడాలి..?

యూపీఐ లైట్‌, ట్యాప్‌ అండ్‌ పే వంటి పద్ధతులు ఉన్నాయి. వీటి ద్వారా పిన్‌ లేకుండానే లావాదేవీలు చేయవచ్చు. అదే ‘వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ (VCC)’. ఇంతకీ ఏంటీ కార్డు? దీంతో ప్రయోజనాలు ఉన్నాయా? దీన్ని ఎలా వాడాలి? తెలుసుకుందాం.

Written By: Neelambaram, Updated On : June 14, 2024 4:41 pm

Virtual Credit Card

Follow us on

Virtual Credit Card: డిజిటల్ లావాదేవీలతో పారదర్శకత ఉండడంతో పాటు కాగితాల ప్రింట్ ఖర్చు తగ్గుతుంది. ఒక్క డిజిటల్ లావాదేవీలతో రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు భారత్ ఇదే తీరును అనుసరిస్తుంది. కూరగాయల వ్యాపారుల నుంచి భారీ ఇండస్ట్రీల వరకు యూపీఐ ఉన్నాయి.

యూపీఐ లైట్‌, ట్యాప్‌ అండ్‌ పే వంటి పద్ధతులు ఉన్నాయి. వీటి ద్వారా పిన్‌ లేకుండానే లావాదేవీలు చేయవచ్చు. అదే ‘వర్చువల్‌ క్రెడిట్‌ కార్డ్‌ (VCC)’. ఇంతకీ ఏంటీ కార్డు? దీంతో ప్రయోజనాలు ఉన్నాయా? దీన్ని ఎలా వాడాలి? తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు డిజిటల్ వెర్షనే వర్చువల్ కార్డు. క్రెడిట్‌ కార్డులు సాధారణంగా భౌతికంగా జారీ చేస్తారు. ఈ కార్డు నుంచి లావాదేవీలు జరపాలంటే వెంట ఉండాల్సిందే. వర్చువల్‌ కార్డుతో ఆ సమస్య ఉండదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్‌లైన్‌లో దీన్ని వినియోగించుకోవచ్చు. పేమెంట్‌ సమయంలో క్రెడిట్‌ కార్డు నంబర్‌కు బదులు వర్చువల్‌ కార్డ్‌ వివరాలు నమోదు చేయాలి. ఆన్‌లైన్‌ లావాదేవీల కోసమే దీన్ని తీసుకువచ్చారు. కార్డు వివరాలు బహిర్గతం కావద్దని కోరుకోవడం సహజమే. ఈ క్రెడిట్‌ కార్డుతో వివరాలు ఎప్పటికీ బహిర్గతం కావు.

వర్చువల్ కార్డు కావాలంటే కార్డుకు సంబంధించి బ్యాంకులో ఖాతా ఉండాలి.. లేదంటే క్రెడిట్ కార్డు ఉన్నా సరిపోతుంది. చాలా వరకు బ్యాంకులు ఈ కార్డును అందజేస్తున్నాయి. బ్యాంకుల వారీగా కార్డులు, ఫీజులు, రుసుములు భిన్నంగా ఉంటాయి. బ్యాంక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ కార్డ్‌ను జనరేట్‌ చేసుకోవచ్చు. ఫిజికల్ క్రెడిట్ కార్డు లాగానే దీనికి కూడా నెంబర్, డేట్, సీవీవీ ఉంటుంది. అయితే ఈ నంబర్లు తాత్కాలికమే. అంటే కార్డు వినియోగానికి పరిమిత వ్యవధి ఉన్నంత వరకే ఉంటాయి. ఒక రోజు (24 గంటల) నుంచి రెండు రోజులు (48 గంటల) వరకు మాత్రమే వినియోగించడానికి వీలవుతుంది.

ప్రయోజనాలు- ప్రతికూలతలు
* అదనపు భద్రత కోసం వర్చువల్ కార్డును తెచ్చారు. కాబట్టి కార్డు వివరాలు తాత్కాలికంగా ఉంటాయి. మోసం జరిగే ప్రమాదం ఉండదు. తరచూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారికి ప్రయోజనకరం.
* కార్డును జెనరేట్‌ సమయంలోనే లావాదేవీల పరిమితిని ఎంచుకుంటారు. కాబట్టి ఖర్చును నియంత్రించడంలో సాయపడుతుంది.
* ముఖ్యంగా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం తీసుకువచ్చింది కాబట్టి ఆఫ్‌లైన్‌ చెల్లింపులు కుదరవు.
* పరిమితి సమయమే ఉంటుంది కాబట్టి పదే పదే వాడడం కుదరదు. కావాలంటే మరోసారి జనరేట్‌ చేసుకోవాల్సిందే.