https://oktelugu.com/

Credit Card Bill: గడువులోపు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే ఏమవుతుంది?

క్రెడిట్ కార్డు ఆర్థిక సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. క్రెడిట్ కార్డును వాడుకుంటూ అవసరమైన బిల్లులు గడువులోగా చెల్లించినట్లయితే బ్యాంకు దృష్టిలో గుడ్ కన్జ్యూమర్ గా పేరు తెచ్చుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 2, 2023 3:05 pm
    Credit Card Bill

    Credit Card Bill

    Follow us on

    Credit Card Bill: నేటి కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఇబ్బడిముబ్బడిగా జారీ చేస్తున్నాయి. గతంలో సాలరీ, ఆదాయాన్ని బేస్ చేసుకొని కార్డులను జారీ చేసేవారు. కానీ ఇప్పుడు కొన్ని ధ్రువపత్రాలు ఉండే కొన్ని బ్యాంకులు ఇంటికి వచ్చి మరీ కార్డులు ఇస్తున్నారు. క్రెడిట్ కార్డు వల్ల లభాలున్నాయి.. సరిగ్గా ఉపయోగించుకోకపోతే నష్టాలూ అధికంగానే ఉన్నాయి. క్రెడిట్ కార్డు రెండువైపులా పదునున్న కత్తి లాంటింది. అందువల్ల దీనిని జాగ్రత్తగా వాడుకోవాలి. క్రెడిట్ కార్డులు తీసుకోగానే దానిని విపరీతంగా యూజ్ చేస్తారు. ఇష్టమొచ్చినట్లు వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ గడువులోగా బిల్లులు చెల్లించడంలో పొరపాట్లు చేస్తారు. ఇలా గడువులోగా బిల్లులు చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా?

    క్రెడిట్ కార్డు ఆర్థిక సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. క్రెడిట్ కార్డును వాడుకుంటూ అవసరమైన బిల్లులు గడువులోగా చెల్లించినట్లయితే బ్యాంకు దృష్టిలో గుడ్ కన్జ్యూమర్ గా పేరు తెచ్చుకుంటారు. దీంతో బ్యాంకులు సైతం కొన్ని ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటాయి. అలాగే రివార్డ్ పాయింట్స్ ఇస్తాయి. క్రమశిక్షణ గల కస్టమర్ గా పేరు తెచ్చుకోవడానికి ఇన్ టైంలో బిల్లు పే చేయాల్సి ఉంటుంది.

    గడువులోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే ఫెనాల్టీ బాగానే పడుతుంది. నిర్ణయించిన తేదీలోగా బిల్లులు చెల్లించని పక్షంలో రూ.500తో పాటు జీఎస్టీ, తదితర ఛార్జీలు విధిస్తారు. ఇది రోజులు పెరిగే కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది. ఈ తరుణంలో వాడుకున్న మొత్తానికి డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది.

    క్రెడిట్ కార్డు బిల్లు నిర్ణయించిన తేదీలోగా కట్టకపోతే సిబిల్ స్కోరు తగ్గుతుంది. ఈ సిబిల్ స్కోరు తగ్గితే ఎటువంటి ఆఫర్స్ రావు. పైగా కొత్త రుణాలు లేదా కొత్త కార్డులు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడుతాయి. సిబిల్ స్కోరు తగ్గడం వల్ల కొత్త బ్యాంక్ అకౌంట్ ఇవ్వడంలోనూ ఆలోచిస్తాయి. అందువల్ల సిబిల్ స్కోరు తగ్గకుండా జాగ్రత్త పడాలి.

    కార్డు మీద కొంత పరిమితి ఉన్నట్లయితే దీనిని సవ్యంగా వాడితో క్రెడిట్ స్కోరును బ్యాంకు వారు ఆటోమేటిక్ గా పెంచేస్తారు. అయితే బిల్లులు ఒక్కసారి చెల్లించడంలోనూ నిర్లక్ష్యం చేస్తే ఈ క్రెడిట్ స్కోరు పెరగదు. దీంతో అత్యవసరాలకు క్రెడిట్ కార్డు అవసరం లేకుండా పోతుంది. అందువల్ల బిల్లుల సకాలంలో చెల్లించి ఇలాంటి అవకాశాలు మిస్ చేసుకోకుండా ఉండండి.