Voter ID With Aadhar: ఒక భారతదేశ పౌరుడిగా 18 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. అదే విధంగా భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు కూడా ఎంతో కీలకమైనదని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క పథకానికి ఆధార్ కార్డు అవసరం ఎంతో ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలలో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగకుండా పాన్ కార్డ్, రేషన్ కార్డ్ వంటివాటికి ఆధార్ లింక్ చేస్తూ ఉండటం మనం చూసాము.అయితే ప్రస్తుతం ఓటర్ ఐడి కూడా ఆధార్ అనుసంధానం చేయాలని అధికారులు వెల్లడించారు. మరి ఇలా ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానం చేయడం వల్ల ఏవిధమైన ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ కి పంపించారా.. వెంటనే ఇలా చేయండి?
ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు, 2021′ లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎన్నో నిరసనలు చేపట్టాయి. అయితే ఈ బిల్లు ఆమోదం తెలిపి ఓటర్ కార్డ్ ఆధార్ కార్డు అనుసంధానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి లాభాలు నష్టాలు కలుగుతాయనే విషయానికి వస్తే..ఓటర్ కార్డ్ ఆధార్ కార్డు అనుసంధానం చేయడానికి గల కారణం ఎన్నికల సమయంలో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగకుండా ఉండడం కోసం ఆధార్ అనుసంధానాన్ని ప్రవేశపెట్టారు.
ఒక వ్యక్తి ఒక గ్రామం నుంచి నగరానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడి ఉంటారు. అయితే ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానం చేయటం వల్ల ఆ వ్యక్తి నగరంలో ఓటు వేయడం మాత్రమే జరుగుతుంది. ఎక్కడైతే ఆధార్ అడ్రస్ ఉంటుందో ఆ ప్రాంతంలోనే ఓటు వేయడానికి వీలవుతుంది. ఈ క్రమంలోనే ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు వేయడానికి కుదరదు. అందుకోసమే ఓటర్ కార్డ్ ఆధార్ అనుసంధానం చేయాలని బిల్లును ప్రవేశపెట్టారు.
Also Read: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్.. ఒక్కొక్కరికి ఏకంగా రూ.6 లక్షలు!