Gold vs Silver Price: భారత దేశంలో బంగారం, వెండి ధరలు.. నియంత్రణ లేకుండా పెరుగుతున్నాయి. ఎవరి ఊహకు అందనంతగా ధరలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు బంగారం ధరకన్నా.. వెండి ధర తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు బంగారం ధరతో సమానంగా వెండి ధర కూడా పోటీ పడుతోంది. శనివారం ఒక్కరోజే వెండి ధర రూ.20 వేలు పెరిగింది. వెండి మార్కెట్ రికార్డు స్థాయి పెరుగుదలను సాధిస్తోంది. ఈ ట్రెండ్ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారులు, ఆభరణ కస్టమర్లపై ప్రభావం చూపుతుంది.
ఒక్క రోజే రూ.20 వేల పెరుగుదల..
ఆసియా మార్కెట్లలో వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. నిన్న(డిసెంబర్ 26న) కిలో వెండి రూ.9 వేలు పెరిగింది. శనివారం(డిసెంబర్ 27న) ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగి కిలో ధర రూ.2,74,000కు చేరింది. గత 6 రోజుల్లో మొత్తం రూ.48,000 పెరుగుదల నమోదైంది. ఇది చారిత్రక రికార్డు.
కారణాలు ఇవే..
వెండి ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయ కారణాలు కీలకం. అమెరికా డాలర్ బలహీనత, గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్, పారిశ్రామిక డిమాండ్ (సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్‌లో వెండి ఉపయోగం) ప్రధాన కారణాలు. భారతదేశంలో దీపావళి సీజన్‌కు ముందు డిమాండ్ పెరిగింది.
బంగార కూడా…
ఇక బంగారం ధరల కూడా రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తగ్గుదల అప్పుడప్పుడు నమోదైనా స్వల్పంగానే ఉంటుంది. పెరుగుదల మాత్రం గణనీయంగా ఉంటుంది. 24 క్యార్టె 10 గ్రాముల బంగారం ధర డిసెంబర్ 27న రూ.1,41,220కిపెరిగింది. 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.5,100 పెరిగి సుమారు రూ.1,41,220కు చేరింది. 22 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,100 పెరుగుదలతో ధర రూ.1,29,450గా ఉంది.
గ్లోబల్ అనిశ్చితి కారణంగా..
ఈ రెండు లోహాల పెరుగుదల గ్లోబల్ అనిశ్చితులతకు సంకేతం. ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం, అమెరికా ఫెడ్ రేట్ కట్స్, చైనా డిమాండ్ వల్ల సేఫ్–హేవెన్ ఎసెట్‌లుగా బంగారం–వెండి ఆకర్షితం అవుతున్నాయి.
అయితే ఇది పెట్టుబడుదారులకు షార్ట్–టర్మ్ ట్రేడర్లకు లాభాలు అందిస్తోంది. 6 రోజుల్లో 20%పైగా రిటర్న్స్ వస్తున్నాయి. ఇన్వెస్టర్లు మ్యాక్స్ ఫ్యూచర్స్ లేదా ఈటీఎఫ్‌ల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. భారత్‌లో ఆభరణ ఎగుమతులు పెరిగే అవకాశం. ఇదే సమయంలో సామాన్యులకు ఆభరణాలు కొనడం ఇక అసాధ్యమే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.
రాబోయే రోజుల్లో వెండి రూ.3 లక్షలు, బంగారం రూ.1,80,000/10గ్రా (24 క్యారెట్లు) టార్గెట్‌లు చూపిస్తున్నాయి. అయితే, అమెరికా ఎకానమీ డేటా, ఆర్‌బీఐ పాలసీలు మానిటర్ చేయాలి. ఈ ట్రెండ్ ఆర్థిక అస్థిరతకు సంకేతం. స్థిరంగా పెట్టుబడి పెట్టినవారు లాభపడతారు.