ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమైన కార్డ్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా నమోదు కావడం వల్ల మనలో చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా, పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తప్పుగా నమోదు కావడంతో కొన్నిసార్లు పథకాలకు అర్హత ఉన్నప్పటికీ వాటికి అర్హత పొందలేకపోతూ ఉంటాం. అయితే ఇంట్లో మొబైల్ ఫోన్ ను ఉపయోగించి సులువుగా వివరాలను మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డ్ లో అడ్రస్ మార్చుకోవాలంటే resident.uidai.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిక్వెస్ట్ ఆధార్ కన్ఫర్మ్ లెటర్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ఓపెన్ కాగా అందులో ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయడంతో పాటు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చే లింక్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చాను నింపి వన్ టైమ్ పాస్ వర్డ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూఐడీఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రొసీడ్ టు అప్ డేట్ అడ్రస్ పై క్లిక్ చేసి అడ్రస్ ను సబ్మిట్ చేయాలి.
ఈ విధంగా సులభంగా అడ్రస్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ లో పేరు మార్చుకోవాలని అనుకుంటే ssup.uidai.gov.in వెబ్ సైట్ పై క్లిక్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ అప్ డేట్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో నేమ్ అప్ డేట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రూఫ్ ను సబ్మిట్ చేయడం ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ను సులభంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ విధంగా ఆధార్ కార్డ్ లో పేరు, అడ్రస్ ను సులభంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ వివరాలు లేదా మీ కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా నమోదై ఉంటే ఈ విధంగా వివరాలను మార్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.