Homeబిజినెస్Vivo V70 launch India: వివో V70, V70 ఎలైట్‌.. బిగ్‌ బ్యాటరీ.. జెయిస్‌ కెమెరాలతో...

Vivo V70 launch India: వివో V70, V70 ఎలైట్‌.. బిగ్‌ బ్యాటరీ.. జెయిస్‌ కెమెరాలతో వచ్చేసింది..

Vivo V70 launch India: టెలిఫోన్‌ తయారీ సంస్థ వివో.. భారత మార్కెట్‌లో కొన్నేళ్లు ఆధిపత్యం కనబర్చింది. అయితే రెండు మూడేళ్లుగా శాంసంగ్, యాపిల్‌తోపాటు ఇతర సంస్థలతో పోటీపడలేకపోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లతో కొత్త మోడళ్లను అందుబాటులోకి తేవడం లేదు. కొన్ని మోడల్స్‌ వచ్చినా ఫీచర్స్‌ నచ్చక ఫెయిల్‌ అవుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్కెట్‌లో పూర్వ వైభం తెచ్చుకునేలా తాజాగా తన వీ సిరీస్‌ను విస్తచించింది. వీ70, బీ70 ఎలైట్‌ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది.

ఫీచర్స్‌ ఇలా..
ఈ ఫోన్‌లు అధునాతన AMOLED స్క్రీన్, ఏరోస్పేస్‌ గ్రేడ్‌ లోహ ఫ్రేమ్‌తో తయారు చేసింది. సానీ సెన్సార్లను జెయిస్‌ ఆప్టిక్స్‌ ద్వారా మెరుగుపరిచిన 50 ఎంపీ కెమెరాలు దీని ప్రత్యేకత. ఆండ్రాయిడ్‌ 16తో పనిచేసే ఈ డివైస్‌లకు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ హామీ ఇస్తుంది. ఐపీ 68+ ఐపీ 69 రేటింగ్‌తో ధూళి, నీటి నుంచి పూర్తి రక్షణ ఇస్తుంది.

అందుబాటు ధరల్లో..
వీ70 మోడల్‌ రెండు ఆప్షన్లలో (8GB+256GB) ధర రూ.45,999, 12GB+256GB) ధర రూ.49,999కు లభిస్తుంది. ఇక వీ70 ఎలైట్‌ మూడు వేరియంట్లులో అందుబాటులో ఉంది. (8GB+256GB ధర రూ.51,999, 12GB+256GB ధర రూ.56,999, 12GB+512GB ధర రూ.61,999గా ఉంది. ఫిబ్రవరి 19 నుంచి vivo.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అధికారిక దుకాణాల్లో ప్రీ–బుకింగ్‌. సేల్స్‌ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానున్నాయి.

ప్రత్యేక ఆఫర్లు
SBI, Kotak, DBS, AmEx, HSBC, IDFC, Yes Bank, BOB కార్డులతో 10% క్యాష్‌బ్యాక్‌. 10% ఎక్స్‌చేంజ్‌ బోనస్, 18 నెలలు జీరో డౌన్‌ పేమెంట్, రూ.899 నుంచి వీ–షీల్డ్‌పై 40% తగ్గింపు లభిస్తుంది.

పూర్తి స్పెసిఫికేషన్స్‌ఇవీ..
– డిస్‌ప్లే 6.59 ఇంచ్‌ ఫ్లాట్‌ AMOLED, 1260X2750 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్‌ రేట్, 5000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌. ప్రాసెసర్‌ వీ70లో Snapdragon 7 Gen, ఎలైట్‌లో Snapdragon 8s Gen 3, Origin OS 6తో ఆండ్రాయిడ్‌ 16. కెమెరాలు వెనుక 50 ఎంపీ మెయిన్‌ (f/1.88), 8 ఎంపీ అల్ట్రా–వైడ్‌ (f/2.2, 115ని), 3x పెరిస్కోప్‌ టెలిఫోటో (f/2.65) ఉంటాయి. ఫ్రంట్‌ 50 ఎంపీ ఆటోఫోకస్‌ (f/2.0) ఉంటుంది. ఇక బ్యాటరీ 6,500 mAh, 90 డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్, ఐపీ 68+ఐపీ 69 రక్షణ ఉంటుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular