Homeబిజినెస్Vivo V60 5G launch India: ఇది ఫోన్ కాదు.. ఫోటో స్టూడియో.. వీవో V60...

Vivo V60 5G launch India: ఇది ఫోన్ కాదు.. ఫోటో స్టూడియో.. వీవో V60 5Gతో అదిరిపోయే AI ఎడిటింగ్

Vivo v60 launch In india: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. వీవో నుంచి సరికొత్త Vivo V60 5G ఫోన్ ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే యూఏఈ, మలేషియా, సింగపూర్, ఇండోనేషియాతో పాటు మన దేశంలోని సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ దర్శనమిచ్చింది. అంటే, కంపెనీ ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోందని అర్థం అవుతుంది. భారతదేశంలో ఆగస్టు 12న లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఇది మిస్ అయితే ఆగస్టు 19న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: అవతార్ ట్రైలర్ రివ్యూ: ఈసారి మంట పెట్టే లాగానే ఉన్నాడే!

Vivo V60 5G ధర విషయానికి వస్తే, 8జీబీ + 256జీబీ మోడల్ సుమారు రూ.37,000 నుండి రూ.40,000 వరకు ఉండొచ్చని అంచనా. అంతకుముందు వచ్చిన Vivo V50 బేస్ వేరియంట్ ధర రూ.34,999 ఉండటంతో, V60 ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. మిస్ట్ గ్రే, మూన్‌లైట్ బ్లూ, ఆస్పిషియస్ గోల్డ్ కలర్స్ లో ఈ ఫోన్ లభించనుంది. అలాగే 8జీబీ + 128జీబీ, 12జీబీ + 512జీబీ వంటి ఇతర మెమరీ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి.

వీవో V60 5Gలో టెక్నికల్ ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నాయని లీకులు చెబుతున్నాయి. ఇందులో 6.67-అంగుళాల ఫ్లాట్ AMOLED స్క్రీన్ (20:9 యాస్పెక్ట్ రేషియో)తో వస్తుంది. 1.5K (1260×2800 పిక్సెల్స్) రిజల్యూషన్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. గరిష్టంగా 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అవుట్‌డోర్‌లోనూ క్లియర్ విజిబిలిటీ అందిస్తుంది. IP68 / IP69 వాటర్, డస్ట్ ప్రొటెక్షన్ ఉండడం ఈ ఫోన్ విశేషం. పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (4nm) ప్రాసెసర్‌తో పాటు అడ్రెనో 722 జీపీయూ వస్తుంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు చాలా సపోర్ట్ చేస్తుంది.

Also Read: పవన్ కళ్యాణ్ తో ఉన్న ఈ వ్యక్తి చాలా స్పెషల్, ఎవరో తెలుసా?

ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS తో ఇది విడుదల కానుంది. అయితే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్OSతో కూడా రావచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి 3 పెద్ద OS అప్‌డేట్‌లు లభిస్తాయి. 8జీబీ/12జీబీ LPDDR5 RAM, 128జీబీ/256జీబీ/512జీబీ UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు ఉంటాయి.

Vivo V60 లో ఫోటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ZEISS బ్రాండింగ్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉండనుంది. 50ఎంపీ సెన్సార్ కెమెరా అద్భుతమైన ఫోటోలను తీస్తుంది. 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ క్లియర్ ఫోటోలకు ఉపయోగపడుతుంది. 50ఎంపీ 3X పెరిస్కోప్ లెన్స్ ఉండడం వల్ల దూరం నుంచి కూడా క్లియర్ ఫోటోలను తీసుకోవచ్చు. సెల్ఫీల కోసం ఫ్రంట్ 50ఎంపీ కెమెరా ఉండనుంది. కలర్ స్పెక్ట్రమ్ సెన్సార్, జెయిస్ లెన్స్‌లు, రింగ్-LED ఇల్యూమినేషన్, 4K వీడియో రికార్డింగ్ కెపాసిటీ వంటి ప్రత్యేకతలు ఫోటోగ్రఫీని మరింత మెరుగుపరుస్తాయి.

V60 5G భారీ 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఎక్కువ సేపు ఫోన్ వాడేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు, 90W వైర్డ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. స్క్రీన్ కిందనే ఉండే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా V60 5G ప్రత్యేకతల్లో ఒకటి. అంతేకాదు, ఫన్‌టచ్ OS 15లో అనేక కొత్త AI-బేస్డ్ ఫీచర్లు, ముఖ్యంగా మెరుగైన ఫోటో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయని అంచనా. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌లో హీట్ రెగ్యులేషన్ కోసం వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండవచ్చు. ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తే, వన్‌ప్లస్ నార్డ్ 5, రియల్‌మీ 15 ప్రో, శాంసంగ్ గెలాక్సీ A56 వంటి వాటికి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version