Avatar 3 Trailer Review: ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ (James Cameroon) చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం… ప్రస్తుతం అవతార్ 3 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఫైర్ అండ్ యాష్ అంటూ వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇంతకుముందు వచ్చిన రెండు పార్టులు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా జేమ్స్ కామెరూన్ పేరును ప్రపంచవ్యాప్తంగా టాప్ వన్ లో నిలిపాయి. కాబట్టి ఈ సినిమాల మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ట్రైబల్ తెగ కు చెందిన వాళ్ల మీద కొంతమంది చేస్తున్న దాడిని తట్టుకొని వాళ్ళ పిల్లల్ని ఆ తెగని ఎలా కాపాడారు అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టుగా తెలుస్తోంది. ఇక ఫైర్ తో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అవతార్ పార్ట్ 2 మొత్తం అండర్ వాటర్ లో చిత్రీకరించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ తో వస్తున్న ఈ సినిమా మొదటి రెండు పార్టులకు మించి ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం డిసెంబర్ 9వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఎమోషన్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మ్యూజిక్ అన్ని అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఈ ట్రైలర్ ని చూస్తుంటే అంత ఒకే అనిపించినప్పటికి కంటెంట్ విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పవన్ కళ్యాణ్ క్రేజీ లుక్ అదిరింది!
నిజానికి మొదటి పార్టీకి వచ్చిన గుర్తింపు రెండోవ పార్ట్ కి రాలేదు. ఎందుకంటే రెండో పార్ట్ లో కంటెంట్ వీక్ అయింది. మరి ఈ మూవీలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి…సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ ట్రైలర్ లో చూపించే వినిజానికి అవతార్ సినిమాకి ఇండియాలో బీభత్సమైన ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇక దానికి మించి జేమ్స్ కామెరూన్ చేస్తున్న సినిమాలన్నింటికి వీరాభిమానులు ఉన్నారు. మరి ఈ సినిమా కూడా ఆయన ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందా? జేమ్స్ కామెరూన్ పేరుకి మరోసారి తను న్యాయం చేయగలుగుతాడా? ఈ సినిమాతో మరోసారి ఆస్కార్ అవార్డుని అందుకోగలుగుతాడా?
Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!
లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. హై టెక్నాలజీని వాడి ఈ సినిమాని చిత్రీకరించినట్టుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి అంతటి విజువల్ వండర్ ని స్క్రీన్ మీద చూపిస్తున్న జేమ్స్ కామెరూన్ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడిన తక్కువే అవుతుంది…
