Vivo V50 5G: చైనా కంపెనీ Vivo మొబైల్ అంటే కొందరు ప్రత్యేకంగా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి అనుగుణంగా కంపెనీ ఇండియాలో అనేక రకాల ఉపయోగకరమైన మొబైల్స్ ను అందుబాటులో ఉంచుతోంది. ఈ కంపెనీకి చెందిన మొబైల్స్ ప్రత్యేకంగా కెమెరా విభాగంలో మన్నికగా ఉంటుందని చాలామంది భావన. అయితే లేటెస్ట్ గా వివో కొత్తగా ఫ్లాగ్ ఫిష్, డైనమిక్ డిజైన్తో కూడిన మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ లో శక్తివంతమైన బ్యాటరీ కూడా ఉండడంతో రోజువారి వినియోగదారులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళితే..
Vivo కంపెనీ నుంచి లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన మొబైల్ V 50 5G. ఈ మొబైల్ డిస్ప్లే గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. 3D Curved డిస్ప్లే తో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇది 6.77 అంగుళాల AMOLED స్క్రీన్ ను అందిస్తుంది. అత్యధిక రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే స్టైలిష్ లుక్ లో ఉండే ఈ మొబైల్ చేతిలో పట్టుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. వివో కొత్త ఫోన్లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ను ఉంచారు. మల్టీ టాస్కింగ్ యూ చేసే వారికి ఈ ప్రాసెసర్ బాగా సరిపోతుంది. అలాగే ఇందులో 8 జిబి రామ్ ఉండడంతో ఒకేసారి వివిధ రకాల యాప్స్ ను ఉపయోగించిన ఫోన్ పై ఎలాంటి భారం పడకుండా ఉంటుంది. ఇక ఇందులో 128 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫైల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫోటోలు, వీడియోలను, యాప్స్ ను స్టోర్ చేసుకోవడానికి ఈ కెపాసిటీ ఉపయోగపడుతుంది.
వివో V 50 కొత్త మొబైల్లో అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన కెమెరాను అమర్చారు. ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండగా.. ఇది AI ఫీచర్లతో పనిచేస్తుంది. అలాగే కావలసిన ఫోటోలను అందిస్తుంది. ఉదయం, సాయంత్రం అని తేడా లేకుండా ఇలాంటి వాతావరణంలో నైనా కావలసిన ఫోటోలను తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి ఈ కెమెరా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ కెమెరాతో 4కె వీడియోను రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా కూడా అద్భుతంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలామంది ఫోన్ యూజర్స్ ఎక్కువగా మారిపోతున్నారు. రోజువారి వినియోగంలో భాగంగా దీనిపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలాంటి వారి కోసం వివో కంపెనీ బలమైన బ్యాటరీని అమర్చింది. వివో ఈ కొత్త ఫోన్లో 7000 mAh బ్యాటరీ ని అమర్చారు. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేయడంతో కావాల్సిన సమయంలో పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో చార్జింగ్ సమస్యలు ఉండవు. వీటితోపాటు 5g కనెక్టివిటీలో ఎలాంటి సమస్యలు ఉండకపోవడం.. బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనిని మార్కెట్లో రూ.29,999 ప్రారంభ ధర నుంచి రూ.34,99 వరకు విక్రయిస్తున్నారు.