Keerthi Bhat Vijay Karthik breakup: ప్రముఖ టీవీ సీరియల్ హీరోయిన్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్(Keerthi Bhatt) తన ప్రియుడు విజయ్ కార్తీక్ తో బ్రేకప్ చేసుకుంటూ నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనం గా మారింది. 2023 వ సంవత్సరం లో వీళ్లిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలు. వీడియోలను ఎన్నో కీర్తి భట్ అప్లోడ్ చేసింది. అంతే కాకుండా విజయ్ కార్తీక్ తో కలిసి పలు టీవీ షోస్ లో కూడా పాల్గొన్నది. అనాధ అయిన కీర్తి భట్ కి ఒక మంచి తోడు దొరికిందని ఆమె అభిమానులు సంతోషించారు. కానీ ఇంతలోపే ఆమె తన రిలేషన్ ని బ్రేక్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. కాంప్రమైజ్ అవుతూ బ్రతకడం నావల్ల కాదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఈ విషయం తెలియగానే విజయ్ కార్తీక్ పై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఈ విషయం పై ఆయన స్పందిస్తూ ‘కీర్తి భట్ నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టుని చూసి నాకు చాలా మంది కామెంట్స్ చేశారు. మీ జంట చూడముచ్చటగా ఉంది, దయచేసి విడిపోకండి అంటూ చెప్పుకొచ్చారు. కానీ నేను ఆమెతో విడిపోవాలని అనుకోలేదు, ఆమెనే నాతో విడిపోవాలని అనుకుంది. డిసెంబర్ లోనే నాకు ఆమె ఈ విషయం చెప్పింది. ఆర్థికంగా నేను స్టేబుల్ గా లేనని ఆమె నిర్ణయం తీసుకుంది. కేవలం నా దగ్గర డబ్బులు లేవని వదిలేయడం కరెక్ట్ కాదని ఆమెకి చెప్పే ప్రయత్నం చేశాను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఆమెని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. కాంప్రమైజ్ అవుతూ జీవించలేనని, నీకంటే నాకు బెటర్ ఛాయస్ గా ఒకరు దొరికారని చెప్పింది’.
‘అలా చెప్పిన తర్వాత కూడా ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చాలానే చేసాను, కానీ ఆమె నిర్ణయం తీసేసుకున్నాను, వదిలేయ్ అని చెప్పింది. ఇక చేసేది ఏమి లేక నేను కూడా లైట్ తీసుకున్నాను. కీర్తి భట్ కి ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నాను, కనీసం ఇప్పుడు ఆమె రిలేషన్ పెట్టుకున్న వ్యక్తితో అయినా సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంది కీర్తి మీతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో తొలగించింది, మీరు కూడా తీసేయండి అని అడుగుతున్నారు. కానీ అలాంటి పోస్టులు పెట్టడం వెనుక నాకు ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ తాలూకు పెయిన్ ఎప్పుడైతే తగ్గుతుందో, అప్పుడే డిలీట్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కీర్తీ భట్ తొలుత మహేష్ అనే సీరియల్ హీరో తో ప్రేమాయణం నడిపింది. బిగ్ బాస్ తర్వాత అతనితో బ్రేకప్ అయ్యి విజయ్ కార్తీక్ తో రిలేషన్ పెట్టుకుంది. ఇప్పుడు ఇతనితో కూడా బ్రేకప్ అయ్యి మరొకరితో రిలేషన్ పెట్టుకుంది.