Realme 11 Pro: మధ్యతరగతి ప్రజల కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తుంటాయి. వీటిలో రియల్ మీ ఒకటి. ప్రీమియం ఫోన్లతో పోటీ పడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన ఫీచర్లను సెట్ చేస్తూ.. అతి తక్కువ ధరలోనే మొబైల్స్ అందించాలని ఈ కంపెనీ చూస్తుంది. ఇందులో భాగంగా Real Me 11 Pro అనే మొబైల్ ను గతంలోని మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫోన్ గురించి ఆన్లైన్లో ఎక్కువగా చర్చ సాగుతోంది. యూత్ నుంచి ప్రొఫెషనల్ కోసం ఫోన్ వాడేవారు సైతం దీనిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంతకీ అందరూ ఆకట్టుకునేలా ఈ మొబైల్లో ఏమేమి ఉన్నాయంటే?
రియల్ మీ 11 ప్రో డిజైన్ ప్రీమియం లుక్ ను అందిస్తుంది. ఇది కర్వ్డ్ ఎడ్జ్ ప్రేమ్ ను కలిగి ఉంది. దీంతో ఇది ఫ్లాగ్ ఫిష్ వలే అనిపిస్తుంది. ప్యానల్ మొత్తం లెదర్ textured తో ఫినిషింగ్ చేశారు. దీంతో దీనిపై ఎలాంటి వెలిముద్రలు లేదా మరకలు పడిన వెంటనే చెరిపేసేందుకు సహాయపడుతుంది. దీని స్క్రీన్ పెద్దగా ఉన్నప్పటికీ చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ మొబైల్లో 6.7 అంగుళాల HD+ AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది సున్నితమైన, స్మూత్ స్క్రోలింగ్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. సినిమాలు చూసేవారికి, గేమింగ్ కోసం ఈ డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. సోషల్ మీడియాతో పాటు బ్రౌజింగ్ చేసే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తువులను స్పష్టంగా డిస్ప్లే చేస్తుంది.
ఈ మొబైల్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ను అమర్చారు. ఇది వెబ్ బ్రౌజింగ్ చేసే వారికి, సోషల్ మీడియా వినియోగించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ చిప్ తో త్వరగా యాప్స్ ఓపెన్ అవుతాయి. అలాగే ఇందులో 12 జిబి రామ్ ఏర్పాటు చేయడంతో ఒకేసారి రకరకాల యాప్స్ ను ఉపయోగించినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గేమింగ్ కోరుకునే వారికి సైతం ఇది ఇబ్బందిగా అనిపించదు. ఈ మొబైల్లో ప్రధానంగా కెమెరా గురించి చెప్పుకోవచ్చు. ఇందులో 100 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఇది ఏఐ తరహాలో శక్తివంతమైన ఫోటోలను స్నాప్ చేస్తుంది. వాతావరణంతో సంబంధం లేకుండా అద్భుతమైన ఫోటోగ్రఫీ అందిస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా అనుకూలమైన మెగా పిక్సెల్ లో ఉండడంతో కావాల్సిన పిక్స్ ను అందిస్తుంది. అలాగే రియల్ మీ 11 ప్రో మొబైల్ లో బ్యాటరీ 5000 mAh గా ఉంది. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే రోజంతా వినియోగించినా కూడా చార్జింగ్ తక్కువగా డౌన్ అవుతుంది. ఈ బ్యాటరీ 67 W చార్జింగ్తో ఫాస్ట్గా చార్జింగ్ చేసుకోవచ్చు. బిజీగా ఉండేవారు తొందరగా చార్జింగ్ కావాలని అనుకుంటే ఈ చార్జర్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ను మార్కెట్లో రూ.9,500 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీంతో మిడ్ రేంజ్ పీపుల్స్ కు చాలా వరకు పడనుంది.