Vivo v70 FE phone launch in India: చైనా కంపెనీ Vivo తన మొబైల్స్ ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే Vivo v70 వంటి ఫోన్లతో ఆకర్షించిన ఈ కంపెనీ ఇప్పుడు కొత్తగా Vivo v70 FE అనే మొబైల్ ను ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చింది. వివో కంపెనీ అనగానే కెమెరా పనితీరు బాగుంటుందని కొందరి వినియోగదారుల అభిప్రాయం. అందుకు అనుగుణంగానే ఈ కొత్త మొబైల్స్ లో అద్భుతమైన కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. అలాగే మెరుగైన బ్యాటరీ కూడా ఇందులో కనిపిస్తోంది. రోజువారి వినియోగదారులతో పాటు యూత్ కు అనుగుణంగా ఈ మొబైల్ ఉండనుంది అని కొన్ని వర్గాల వారు చెబుతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ లోకి వెళితే..
Vivo v70 FE మొబైల్లో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. ఇది 1.5 కే resolution తో పనిచేస్తుంది. అలాగే ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 1900 nits బ్రైట్నెస్ తో పనిచేసే ఇందులో 4NM ప్రాసెసర్ పై 7360 Dimencity చిప్ సెట్ ద్వారా పవర్ ను పొందే అవకాశం ఉంది. ఈ మొబైల్ లో 8 జిబి రామ్ 256gb స్టోరేజ్ ఉండనుంది. అలాగే 12gb ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
వివో మొబైల్స్ అనగానే కెమెరా పనితీరు బాగుంటుందని చాలామంది భావన అందుకు అనుగుణంగానే ఈ ఈ కొత్త మొబైల్ Vivo v70 FE లో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేయనుంది.32 MP సెల్ఫీ తో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారితో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం ఈ కెమెరా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ లో కంటే ఇందులో మెయిన్ కెమెరా మెగాపిక్సల్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
ఈ మొబైల్లో బ్యాటరీ పనితీరు కూడా వేరే లెవెల్ అని అంటున్నారు. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 90 W ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో పనిచేయనుంది. మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారితోపాటు రోజంతా గంటలపాటు మొబైల్ వినియోగించిన కూడా బ్యాటరీ చార్జింగ్ తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. మార్చి 9 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ ధర రూ.35,000 నుంచి విక్రయిస్తున్నారు. కాన్ఫిగరేషన్ బట్టి ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మొబైల్ మస్కి పర్పుల్, ఓసియన్ బ్లూ, టైటానియం సిల్వర్ కలర్ లో అందుబాటులో ఉంది.