Vijay Shekhar Sharma Success Story: ఇంగ్లీష్ అంటే నేటి రోజుల్లో చాలామందికి భయం. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది పరాయి భాష. పైగా ఆ భాషను వ్యక్తీకరించే విధానం కూడా వేరే విధంగా ఉంటుంది. అందువల్లే చాలామంది ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయపడుతుంటారు. ఇంగ్లీష్ మీద పట్టు సాధించడానికి రకరకాల ఇనిస్టిట్యూట్ లకు వెళ్తుంటారు. ఇలాంటి అనుభవం మనలో చాలామందికి నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుంది. అయితే అలాంటివారు పేటీఎం వ్యవస్థాపకుడు స్టోరీ చదవాల్సిందే.
Also Read: ఈ వయసులో బోనీ కపూర్ కు ఎందుకింత కష్టం..
ఇప్పుడంటే ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటివి అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు డిజిటల్ పేమెంట్స్ అంటే పేటీఎం మాత్రమే. ఆ పేటీఎం ను విజయ్ శేఖర్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. పేటీఎం ద్వారా మనదేశంలో డిజిటల్ పేమెంట్లలో సంచలనం నమోదయింది. ఆ తర్వాత మిగతా కంపెనీలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించాయి. తద్వారా డిజిటల్ పేమెంట్లలో మన దేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పోటీ సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ పేటీఎం ఇప్పటివరకు తన చరిష్మాను తగ్గించుకోలేదు. పేటీఎం ఏర్పాటు చేసిన విజయ్ శేఖర్ ఉన్నత విద్యావంతుడు అయినప్పటికీ… ఆంగ్లం అద్భుతంగా మాట్లాడే సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఒకప్పుడు అతడు కూడా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు.
విజయ్ శేఖర్ స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు టాపర్ గా ఉండేవాడు. దీంతో అతడు ముందు వరుస బెంచీలో కూర్చునేవాడు. ఒకానొక సందర్భంలో ఆయన స్కూల్లో పనిచేయడానికి ఒక ఇంగ్లీష్ టీచర్ వచ్చారు.. ఆయన గొంతు తడుముకోకుండా ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న తీరు చూసి విజయ్ శేఖర్ భయపడేవారు. ఎందుకంటే ఇంగ్లీష్ అంత గొప్పగా విజయ్ శేఖర్ కి వచ్చేది కాదు. దీంతో తనను టీచర్ ఏమైనా అంటారేమోనని భయంతో బ్యాక్ బెంచ్ కి విజయ్ శేఖర్ వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని ఆయన ఒక కార్యక్రమంలో వెల్లడించారు.. ఇంగ్లీష్ అంటే భయం వద్దని.. ధైర్యంగా మాట్లాడాలని సూచించారు.. కేవలం ఇంగ్లీష్ విషయంలోనే కాదని.. మిగతా అన్నింటిలోనూ ఇదే ధైర్యాన్ని ప్రదర్శించాలని అప్పుడే జీవితంలో విజయవంతమవుతామని విజయ్ శేఖర్ పేర్కొన్నారు.. మొదట్లో పేటియం తాను ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ఎగతాళి చేశారని.. ఇప్పుడు వారే నా ధైర్యాన్ని పొగుడుతున్నారని విజయ్ శేఖర్ వెల్లడించారు.