Vijay Mallya: ఆర్థిక అవకతవకలకు పాల్పడి.. మనదేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేయడంతో.. బతుకు జీవుడా అనుకుంటూ ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం అతడు ఇంగ్లాండ్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అతను కేవలం వ్యాపారి మాత్రమే కాదు, ఐపీఎల్ లో బెంగళూరు జట్టు ఒకప్పటి అధిపతి కూడా.. ప్రముఖ బీర్ల తయారీ సంస్థ యూ బీ గ్రూప్ వ్యవస్థాపకుడిగా విజయ్ మాల్యా సుపరిచితుడు. పైగా అతని కంపెనీ ఆధ్వర్యంలో తయారయ్యే కింగ్ ఫిషర్ విశేషమైన ఆదరణ పొందింది. విజయ్ మాల్యా విలాసాలకు అలవాటు పడిన వ్యాపారవేత్త.. అప్పట్లో ఈయన రూపొందించే క్యాలెండర్ కు విపరీతమైన డిమాండ్ ఉండేది. అందమైన అమ్మాయిలతో సముద్రతీరాలలో అర్థనగ్నమైన భంగిమలలో ఫోటోలు తీసి క్యాలెండర్ రూపొందించేవాడు. ఇలా అనేక విలాసాలు ఆయనను ఆర్థికంగా దెబ్బ తీశాయి.
తన కంపెనీలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలలో అక్రమాలకు పాల్పడడంతో దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. దీంతో ఆయన విదేశాలకు పారిపోయాడు. ఆయన మనదేశంలో ఉన్నప్పుడు వారసుడిగా సిద్ధార్థ మాల్యా వెలుగులోకి వచ్చేవాడు. ప్రతి సందర్భంలోనూ దీపికా పదుకొనే తో కలిసి కనిపించేవాడు.. ఆ తర్వాత అతని కూడా విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే చాలామంది అనుకున్నట్టు సిద్ధార్థ మాల్య మాత్రమే కాదు.. విజయ్ మాల్యాకు ఇంకా ఇద్దరు వారసులు ఉన్నారు. విజయ్ మాల్యా కు ఒకరు మాత్రమే భార్య కాదు.. ఆయనకు ఏకంగా ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు భార్యల ద్వారా ఆయనకు ముగ్గురు సంతానం.. అయితే మూడో అమ్మాయి కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
విజయ్ మాల్యా తండ్రి పేరు విటల్ మాల్యా, తల్లి పేరు లలితా రామయ్య. విజయ్ మాల్యా సమీరా మాల్యా ను వివాహం చేసుకున్నారు. సమీరా ద్వారా సిద్ధార్థ మాల్యా జన్మించారు. ఆ తర్వాత రేఖా మాల్యాను విజయ్ మాల్యా రెండవ వివాహం చేసుకున్నారు. రేఖ ద్వారా తాన్య, లీనా జన్మించారు.. వీరు ముగ్గురు ఉండగానే విజయ్ మాల్యా లైలా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సిద్ధార్థ కు కొన్ని వ్యాపారాలు అప్పగించగా.. మిగతా ముగ్గురు అమ్మాయిలకు వేరువేరు వ్యాపారాలు అప్పగించారు. అయితే లైలా ను విజయ్ ఎందుకు దత్తత తీసుకున్నారు? దీని వెనక ఏం జరిగిందనేది? ఇప్పటికీ రహస్యమేనని కార్పొరేట్ వర్గాలు అంటుంటాయి. మరోవైపు తాన్య, లీనా, లైలా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. వారి వ్యాపారాలలోనే తలమునకలై ఉంటారు.