UPI Payment Limit : ఇండియాలో ఇప్పుడంతా ఆన్ లైన్ ట్రాన్జాక్షనే. పేపర్ బిల్లు నుంచి మార్కెట్లో సురుకునే కొనే వరకు ప్రతి ఒక్కరూ యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. మార్కెట్లో నగదు కొరత లేదా చిల్లర సమస్యల కారణంగా చాలా మంది మొబైల్ ద్వారా యూపీఐ ట్రాన్జాక్జన్ కు అలవాటు పడ్డారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా క్షణాల్లో డబ్బు పంపించుకునే సదుపాయం యూపీఐ ద్వారా మాత్రమే సౌకర్యం ఉంది. ఒక్క ఫోన్ నెంబర్ కొడితే చాలు.. ఎదుటి వారి అకౌంట్లకు కావాల్సిన డబ్బులు పంపించయ్యొచ్చు. అంతేకాకుండా బయటకు వెళ్లినప్పుడు జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు..బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే చాలు. అయితే యూపీఐ ద్వారా నిన్నటి వరకు రూ. లక్ష వరకు ఎవరికైనా పంపించుకునే సదుపాయం ఉంది. తాజాగా రూ. 5 లక్షల వరకు లిమిట్ పెంచినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది అందరికి వర్తిస్తుందా? లేక కొందరికి మాత్రమే ఈ సౌకర్యం ఉందా? ఆ వివరాలేంటి?
2024 జనవరి National Payment Coroporation Of India (NPCI) నివేదిక ప్రకారం 18.41 ట్రిలియన్ నగదు యూపీఐ ట్రాన్జాక్షన్ జరిగింది. జూన్ 2024 లెక్కల ప్రకారం ప్రతినెల 60 లక్ష లమంది కొత్త వినియోగదారులు యూపీఐ కొత్త వినియోగదారులుగా చేరుతున్నారని తెలిపింది. సంవత్సరానికి 49 శాతం పెరిగి జూన్ నాటికి రూ.20.1 బిలియన్లకు చేరిటన్లు ఎన్ పీసీఐ తెలిపింది. అయితే భారత్ లో యూపీఐ సేవలు సులభతరం ఉండడంతో రోజురోజుకు దీని వినియోగదారులు పెరిగిపోతున్నారు. చిన్న మొత్తాల నుంచి భారీ గా నగదును యూపీఐ ద్వారా పంపిస్తున్నారు.
అయితే ఇటీవల Reserv Bank Of India (RBI) యూపీఐ లిమిట్ ను పెంచినట్లు పేర్కొంది. రూ. 1 లక్ష వరకు ఉన్న పరిమితిని రూ. 5 లక్షల వరకు ట్రాన్జాక్షన్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ న్యూస్ వినగానే చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇది అందరికీ కాదనే విషయం తెలుసుకోవాలి. ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం ట్యాక్స్ పేమెంట్స్ చేసేవాళ్లు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే.. ఇప్పటి వరకు వారికి రూ. లక్ష వరకు పరిమితి ఉండేది. దీనిని రూ. 5 లక్షలకు పెంచారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రికి సంబంధించిన బిల్లులను యూపీఐ ద్వారా చెల్లించాలనుకుంటే అప్పుడు కూడా రూ. 5 లక్షల వరకు చెల్లించవచ్చు. ఒకవేళ లక్షకు మించి చెల్లింపులు చేయాలంటే చెక్ లేదా ఇతర మార్గాలను ఎంచుకోవాలి.
కానీ మిగతా ట్రాన్జాక్షన్ కు మాత్రం పరిమితి లేదు. అందువల్ల ఆర్బీఐ గైడ్ లైన్స్ పూర్తిగా చదవాలని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు లక్ష వరకు యూపీఐ ద్వారా పంపించి మిగతా మొత్తాన్ని బ్యాంకు లేదా నగదును అందించేవారు. ఇప్పుడు కూడా అలాంటి గౌడ్ లైన్స్ నే పాలో కావాలి. అయితే ట్యాక్స్ పే చేసే వాళ్లు మాత్రం ఆర్బీఐ సూచించిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా చెల్లింపులు చేసుకోవచ్చు.