https://oktelugu.com/

Double Ismart Movie Review: డబుల్ ఇస్మార్ట్’ ఫుల్ మూవీ రివ్యూ….

2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ సక్సెస్ ని అందుకుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : August 15, 2024 / 11:06 AM IST

    Double Ismart OTT

    Follow us on

    Double Ismart Movie Review: రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్ ‘ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. మరి వీళ్ళ కాంబినేషన్ లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ సక్సెస్ ని అందుకుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఏ విధంగా అయితే ఒక పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ ని చిప్పులోకి ఎక్కించి రామ్ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేసి పోలీస్ చేయాల్సిన పనులు రామ్ తో ఎలాగైతే చేయించారో సేమ్ అదే కాన్సెప్ట్ ను రిపీట్ చేస్తూ సంజయ్ దత్ బ్రెయిన్ ని రామ్ మైండ్ లోకి ఎక్కించి కొన్ని అసాంఘిక కార్యకలాపాలను చేయడానికి సంజయ్ దత్ చూస్తాడు. మరి ఇలాంటి సందర్భంలో రౌడీలు చేసే దుర్మార్గపు పనుల నుంచి సొసైటీని హీరో అయిన రామ్ ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు పూరి జగన్నాథ్ గత సినిమా అయిన లైగర్ తో భారీగా డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఒక్కసారిగా తన ఇమేజ్ ని డ్యామేజ్ అయితే చేసుకున్నాడు. ఇక దాంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. నిజానికి పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు భారీ అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా మారిపోయింది… ఇక ఈ సినిమాలో పూరి తన మేకింగ్ తో మరోసారి మ్యాజిక్ అయితే చేశాడు… ముఖ్యంగా రామ్ క్యారెక్టర్ ని ఇస్మార్ట్ శంకర్ లో ఎలాగైతే చూపించాడో దీంట్లో అంతకుమించి అనేలా చూపించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.

    ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం స్లో నరేశన్ లేకుండా ఫాస్ట్ గా సినిమాను రన్ చేసే విధంగా స్క్రిప్ట్ లో చాలావరకు డెవలప్ మెంట్స్ అయితే చేశాడు… ఇంక మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. కొన్ని కోర్ ఎమోషన్స్ లో మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది…యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫుల్ ఆఫ్ యాక్షన్ తో పాటు కామెడీని కూడా సమపాలలో పండించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా గెటప్ శీను, అలీ లాంటి క్యారెక్టర్ లని సపరేట్ గా కామెడీ కోసమే డిజైన్ చేసుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి డబుల్ ఇస్మార్ట్ కి సినిమాకి మధ్య రామ్ లో కూడా చాలా వేరియేషన్స్ అయితే కనిపించాయి. బాడీ బిల్డ్ లో గాని, డైలాగ్ మాడ్యులేషన్ లో గాని చాలావరకు ఇంప్రూవ్ మెంట్ అయితే కనిపించింది…అదే ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది…ఇక ఈ సినిమా కథ రోటీన్ గా ఉండటం కొంతమంది ప్రేక్షకులకి నచ్చక పోవచ్చు….

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్ట్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ మరోసారి మాస్ కా బాప్ అనేలా నటించి మెప్పించాడు. ఇక పాన్ ఇండియా హీరోగా ఎదగాలనే తన కల మరోసారి నిజమైందనే చెప్పాలి. ఈ సినిమాతో రామ్ కి పాన్ ఇండియా లో భారీ క్రేజ్ దక్కుతుందనేది వాస్తవం… రామ్ చాలా వరకు మంచి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాడు. ఇక ఈ సినిమా ఆయనని మరోసారి మాస్ హీరోగా నిలబెట్టిందనే చెప్పాలి. ఇక గత సినిమా అయినా ‘స్కంద ‘ ఆశించిన మేరకు విజయాన్ని అందించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు కానీ ఈ సినిమాతో మాత్రం భారీ అంచనాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక హీరోయిన్ గా చేసిన కావ్య థాపర్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది.

    ముఖ్యంగా గ్లామర్ షో తో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పుకుందానే చెప్పాలి… సంజయ్ దత్ ఒక స్టైలిష్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. నిజానికి పూరి జగన్నాథ్ సినిమాల్లో విలన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అదే మాదిరిగానే సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా కనిపించడంతో పాటు అక్కడక్కడ నవ్వులను కూడా పూయించాడు… గెటప్ శీను ఆలీ లాంటి నటీనటులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    టెక్నికల్ అంశాలు

    మణిశర్మ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ గా మంచి సక్సెస్ అవ్వడంతో మరోసారి పూరి-మణిశర్మ కాంబినేషన్ కి అయితే మంచి గుర్తింపు లభించింది. దానికి తగ్గట్టుగానే మణిశర్మ ఎక్కడ తగ్గకుండా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా అందించి సినిమా సక్సెస్ లో తను కూడా హెల్ప్ చేశాడనే చెప్పాలి… ఇక శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫి లో పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించనప్పటికీ పూరి తనకు కావాల్సిన బ్లాక్స్ ని పెట్టించుకుని ఈజీగా సినిమాను షూట్ చేసినట్టుగా తెలుస్తుంది… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా రేంజ్ కి తగ్గట్టుగానే చాలా గ్రాండ్ గా ఉండడంతో సినిమాకి భారీ లుక్ అయితే వచ్చింది…

    ప్లస్ పాయింట్స్

    రామ్ యాక్టింగ్
    పూరి డైరెక్షన్
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    రోటీన్ స్టోరీ
    కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్
    ఆలీ ఎపిసోడ్

    రేటింగ్

    ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్

    కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది…