UPI ID : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్‌లో భారీ మార్పులు తీసుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. కొత్త సౌకర్యం ద్వారా వినియోగదారులు ఇకపై ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ లేదా సర్వీస్ ప్లాట్‌ఫారమ్ మీద అయినా తమ UPI IDని సేవ్ చేసుకోవచ్చు. ఈ సేవ ఆన్‌లైన్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను సేవ్ చేసే విధానంలాగానే పనిచేస్తుంది. దీనిని టోకనైజేషన్ అని కూడా అంటారు. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఆన్‌లైన్‌లో UPI ద్వారా చెల్లించేటప్పుడు ప్రతిసారి IDని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తద్వారా పేమెంట్స్ టైం తగ్గుతుంది.
Also Read : కొత్తగా ఉద్యోగంలో చేరారా..? EMI లాక్ లో పడొద్దు..
NPCI వినియోగదారులకు మర్చంట్ చెక్‌పాయింట్ వద్ద వారి UPI IDని సేవ్ చేసుకునే సౌకర్యాన్ని అందించడానికి యోచిస్తోంది. ప్రస్తుతం ఒక కస్టమర్ ఈ-కామర్స్ సైట్‌లో చెక్‌అవుట్ చేసేటప్పుడు సాధారణంగా UPI యాప్‌ను సెలక్ట్ చేసుకుని ఆపై ఏ ఖాతా ద్వారా చెల్లించాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకుంటారు. వినియోగదారుడు తనకు ఇష్టమైన UPI IDని లాక్ చేసినప్పుడు, ఈ ప్రాసెస్‌లోని దశలను తగ్గించి సమయాన్ని ఆదా చేయవచ్చని తెలుస్తోంది.
ఈ సౌకర్యాన్ని ప్రారంభించే ముందు NPCI భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. RBI ఆదేశాల ప్రకారం.. పేమెంట్ గేట్‌వేలు కేవలం కార్డ్‌లను టోకనైజ్ చేయడానికి మాత్రమే అనుమతించాయి. ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులు ప్రతిసారి వెబ్‌సైట్‌లో చెల్లించేటప్పుడు కార్డ్ పూర్తి వివరాలను నింపాల్సిన అవసరం లేదు. UPI IDని సేవ్ చేసే సౌకర్యానికి అనుమతి లభిస్తే UPI ద్వారా చెల్లింపులు కార్డ్ చెల్లింపులతో సమానంగా ఉంటాయి.
ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే వినియోగదారులు తమ UPI IDని, దీనిని UPI హ్యాండిల్ అని కూడా అంటారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, ట్రావెల్ బుకింగ్ అప్లికేషన్స్, ఫుడ్ డెలివరీ యాప్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ వంటి వారు క్రమం తప్పకుండా ఉపయోగించే మర్చంట్ సైట్‌లలో సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వినియోగదారులు ప్రతి లావాదేవీ చేసేటప్పుడు వారి UPI IDని నమోదు చేయవలసిన లేదా UPI అప్లికేషన్‌ను సెలక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
Also Read : దేశంలోని టాప్ బ్యాంకులు ఏవో తెలుసా?