Top Banks : ఆదాయం వచ్చిన కొద్ది బ్యాంకులో డబ్బు దాచుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే నేటి కాలంలో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అధిక వాటి ఆశ చూపి ఖాతాదారులను చేర్చుకుంటున్నారు. కానీ ఇలా అధిక వాటికి ఆశపడి బ్యాంకులో పెట్టుబడి పెట్టిన తర్వాత.. ఏదో రకంగా మోసం చేస్తూ ఉంటున్నాయి. అందుకే మంచి బ్యాంకు ఏదో.. చెడ్డ బ్యాంకు ఎదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. నియమాలు నిబంధన ప్రకారం ఖాతాదారులకు సరైన సేవలను అందిస్తూ ఉంటాయి. మరికొన్ని బ్యాంకులు మాత్రం తమ స్వార్థం కోసం పనిచేస్తూ ఖాతాదారులను మోసం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరైన బ్యాంకులో ఏవో.. ఇందులో పెట్టుబడి పెట్టాలో తెలిపింది. మరి దేశంలో ఉన్న టాప్ బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read : ఆర్బీఐ హెచ్చరిక.. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా.. ఇక అంతే..
దేశంలో అత్యధికంగా సురక్షితమైన బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటికి రక్షణ ఉంటుందని పేర్కొంది. అలాగే ఆ తర్వాత HDFC బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండూ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు వంటివి టాప్ టెన్ ప్లేస్ లో ఉన్నాయి. మీ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడం లేదా ఈ బ్యాంకుకు సంబంధించిన వాటిలో ఫిక్షుడు డిపాజిట్ చేయడం సురక్షితంగా ఉంటుందని పేర్కొంది.
అయితే ఆయా బ్యాంకుల్లో పొదుపు చేసేటప్పుడు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సమయంలో వడ్డీ రేట్లు అలాగే ఇతర సమాచారం ముందే తెలుసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్లాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే కొందరు పెట్టుబడులు పెట్టే సమయంలో వడ్డీ రేట్ల విషయంలో అయోమయానికి గురవుతూ ఉంటారు. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు అందిస్తూ.. మరికొన్ని బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. అయితే దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఎక్కువ వడ్డీ రేటు వచ్చే బ్యాంకుల్లో పొదుపు చేయాలని చెబుతున్నారు. అలాగే లాకింగ్ పీరియడ్ కోరుకునేవారు సైతం మంచి బ్యాంకును ఎంచుకోవాలని అంటున్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు ప్రైవేట్ బ్యాంక్ కంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి బెటర్ ఆప్షన్ అని తెలుపుతున్నారు.
ఇటీవల కొన్ని బ్యాంకులు ఎక్కువ వాటి రేట్లు అందిస్తామని చెబుతూ ఉంటాయి. కానీ అన్ని బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలోనే పనిచేస్తాయనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేసే సమయంలో బ్యాంకుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే బ్యాంకుల పరిస్థితి కూడా తెలుసుకోవాలి. ఒక బ్యాంకు అభివృద్ధిలో ఉంటే మాత్రమే అందులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వెళ్లాలి. లేకుంటే తర్వాత తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.
Also Read : ఈ చిన్న ట్రిక్ తో కేంద్ర ప్రభుత్వం అందించే PPF పథకంతో రూ.1 కోటి రూపాయలు పొందొచ్చు.. ఎలాగంటే…