Mahindra XUV 3XO : దేశంలోనే అతిపెద్ద ఎస్‌యూవీ తయారీ సంస్థ అయిన మహీంద్రా గతేడాది విడుదల చేసిన తన లైనప్ లోని బడ్జెట్ మోడల్ XUV 3XO అమ్మకాలతో అందరికీ షాకిచ్చింది. మహీంద్రా XUV 3XO, XUV300 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌గా ఏప్రిల్ 2024లో రిలీజ్ అయింది. గత నెల మార్చిలో ఈ ఎస్‌యూవీని 7,055 మంది కొనుగోలు చేశారు. ఇది గతేడాది మార్చిలో నమోదైన అమ్మకాల కంటే 240 శాతం ఎక్కువ. గతేడాది మార్చిలో కేవలం 2072 మంది మాత్రమే దీనిని కొనుగోలు చేశారు. XUV 3XO అమ్మకాల్లో ఇంత భారీ పెరుగుదల కనిపించడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఫిబ్రవరి 2025లో కూడా దీనిని 7861మంది కొనుగోలు చేశారు.
Also Read : కొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో మహీంద్రా XUV 3XO టాటా పంచ్, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి అనేక ప్రముఖ మోడళ్లను సైతం వెనక్కి నెట్టింది. అయితే, యూనిట్ల అమ్మకాల పరంగా ఈ మోడళ్లు ఇంకా ముందున్నాయి. అయినప్పటికీ, అమ్మకాల వృద్ధి రేటులో మాత్రం XUV 3XO అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 2025లో 7,055 యూనిట్లు అమ్ముడవ్వగా, గతేడాది ఇదే నెలలో కేవలం 2,072 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మహీంద్రా థార్ 48 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉండగా, టాటా నెక్సాన్ 16 శాతం, మారుతి సుజుకి బ్రెజ్జా 13 శాతం, మారుతి సుజుకి ఫ్రాంక్స్ 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
మహీంద్రా XUV 3XO పాపులర్ మోడల్ XUV300 కొత్త వెర్షన్. ఈ డిజైన్ సబ్-కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇది బోల్డ్ ఎక్స్‌టీరియర్ లుక్‌ను కలిగి ఉంది. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.లేటెస్ట్, హై క్వాలిటీ ఇంటీరియర్ లగ్జరీగా విశాలంగా ఉంటుంది. ఇది ఫీచర్లతో నిండి ఉంది. చిన్న కుటుంబ SUV కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పొచ్చు.
మహీంద్రా XUV 3XO ధర రూ.7.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.15.56 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. XUV 3XO 25 వేరియంట్లలో అందుబాటులో ఉంది. XUV 3XO బేస్ మోడల్ MX1, టాప్ మోడల్ మహీంద్రా XUV 3XO AX7 L టర్బో AT. మహీంద్రా XUV 3XOలో డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉన్నాయి. డీజిల్ ఇంజన్ 1498 సీసీ కాగా పెట్రోల్ ఇంజన్ 1197 సీసీ.
Also Read : ఫార్చ్యూనర్ హవాకి చెక్ పెట్టనున్న ఫోక్స్ వ్యాగన్ కొత్త SUV