Homeబిజినెస్Upcoming Mobiles : స్టైలిష్ డిస్‌ప్లే, సూపర్ ఫీచర్స్.. ఈ వారం లాంచ్ అయ్యే ఫోన్స్...

Upcoming Mobiles : స్టైలిష్ డిస్‌ప్లే, సూపర్ ఫీచర్స్.. ఈ వారం లాంచ్ అయ్యే ఫోన్స్ ఇవే!

Upcoming Mobiles : పాత మొబైల్ నుంచి కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని ఆలోచిస్తున్నారా? అయితే కొంచెం ఆగండి! ఈ వారంలోనే ఒకటి కాదు, ఏకంగా 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు భారతీయ మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నాయి. వివో, ఐకూ, రియల్‌మీ కంపెనీలు వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. విశేషం ఏంటంటే, అధికారికంగా విడుదల కాకముందే ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ప్రత్యేక ఫీచర్లు ఖరారయ్యాయి.

Also Read : ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బ.. యాపిల్‌ స్టోర్ల వద్ద బారులు.. ఎందుకంటే..

Vivo V50e లాంచ్ తేదీ
వివో కంపెనీ ఈ అప్‌కమింగ్ ఫోన్ ఈ వారం ఏప్రిల్ 10, 2025న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. లాంచ్ తర్వాత ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ అప్‌కమింగ్ ఫోన్ కోసం స్పెషల్ పేజీలు క్రియేట్ చేశారు. వాటి ద్వారా ఫోన్ ప్రత్యేక ఫీచర్లు ప్రకటించారు.

Vivo V50e స్పెసిఫికేషన్లు
AI ఫీచర్లతో రానున్న ఈ వివో ఫోన్‌లో అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ప్రస్తుతానికి డిస్‌ప్లే సైజు, ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ గురించి తెలియాల్సి ఉంది.

Realme Narzo 80 Pro లాంచ్ తేదీ
రియల్‌మీ కంపెనీ ఈ ఫోన్ ఏప్రిల్ 9న మధ్యాహ్నం 12 గంటలకు అంటే రేపు భారతదేశంలో విడుదల కానుంది. లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. ప్రత్యేక పేజీ ద్వారా ఫోన్‌లో ఉండే ఫీచర్లు తెలిశాయి.

Realme Narzo 80 Pro స్పెసిఫికేషన్లు
ఈ రియల్‌మీ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 6000mAh బ్యాటరీ, 80W అల్ట్రా ఛార్జ్, VC కూలింగ్ సిస్టమ్ ఇవ్వనున్నారు. ఈ ఫోన్ ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంటుందని సంకేతాలు ఉన్నాయి.

Realme Narzo 80x 5G లాంచ్ తేదీ
రియల్‌మీ నార్జో 80 ప్రోతో పాటు 80x 5G కూడా ఏప్రిల్ 9న భారతీయ మార్కెట్‌లో వినియోగదారుల కోసం విడుదల కానుంది. ఈ ఫోన్ ధర రూ.13,000 కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

Realme Narzo 80x 5G స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంటుంది, ఇది 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. స్పీడ్,మల్టీ టాస్కింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, AI స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి.

iQOO Z10 లాంచ్ తేదీ
ఐకూ బ్రాండ్‌కు చెందిన ఈ ఫోన్ ఏప్రిల్ 11న భారతీయ మార్కెట్‌లో వినియోగదారుల కోసం విడుదల కానుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక పేజీ ద్వారా ఫీచర్లు తెలిశాయి.

iQOO Z10 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో 7300mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 12GB RAMతో 12GB వర్చువల్ RAM సపోర్ట్, 256GB స్టోరేజ్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్, 50 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ కెమెరా సెన్సార్, AI ఫీచర్ల సపోర్ట్ ఉంటుంది.

iQOO Z10x లాంచ్ తేదీ
ఐకూ బ్రాండ్‌కు చెందిన ఒకటి కాదు, రెండు కొత్త ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 11న విడుదల కానున్న ఈ ఫోన్ కూడా అధికారిక లాంచ్ తర్వాత ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.

iQOO Z10x స్పెసిఫికేషన్లు
అమెజాన్‌లో ఈ ఫోన్ కోసం క్రియేట్ చేసిన ప్రత్యేక పేజీ ద్వారా ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, 4nm ప్రాసెస్‌పై బెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వినియోగదారుల కోసం విడుదల కానుందని తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular